అక్రమ కేసులతో ఉద్యమాన్ని ఆపలేరు.. తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగల ఆనంద్ గౌడ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతున్నదని రాజ్యాంగం కల్పించిన హక్కులను కూడా ప్రభుత్వం పోలీసులు కలిసి హరించి వేస్తున్నారని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భాగాల ఆనంద్ గౌడ్ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు జాబ్ క్యాలెండర్ రద్దు చేయాలని ఈ నెల 19వ తేదీన తలపెట్టిన చలో ముఖ్యమంత్రి ఇంటి ముట్టడి కార్యక్రమాన్ని భగ్నం చేయాలని పోలీసులు అక్రమంగా నోటీసు ఇవ్వడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని రాష్ట్రంలో నూతన జాబ్ క్యాలెండర్ విడుదల విడుదల చేయాలని ఇప్పుడు విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ లో ఉద్యోగాలు లేవని ప్రతి సంవత్సరం రెండున్నర లక్షల ఉద్యోగాలు ఇస్తానన్న జగన్మోహన్ రెడ్డి హామీ ఏమైందని దీని ప్రశ్నిస్తున్న యువజన విద్యార్థి సంఘం నాయకులను అక్రమ అరెస్టులతో కేసులతో భయబ్రాంతులకు గురి చేయడం ప్రభుత్వ చేతగానితనాన్ని కి నిదర్శనమని ఆయన ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన బహిరంగ సవాల్ విసిరారు అధికారంలోకి వస్తూనే రెండున్నర లక్షల ఉద్యోగాలు ఇస్తానని మాట చెప్పి నేడు మాటతప్పింది నిజమా కాదా ఈ రాష్ట్రంలో ఉన్న యువతకు సమాధానం చెప్పాలని ఇప్పటివరకు రెండు సంవత్సరాల కాలంలో ఇచ్చిన ఉద్యోగాలు ఎన్నో చెప్పే ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉందని దీనిపై శ్వేతపత్రం విడుదల చేసే ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉందా అని ఆయన సవాల్ విసిరారు ఆడలేక మద్దెల దరువు అన్నట్లు ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వలేక యువతను రోడ్డుమీద పడేసి నిరుద్యోగ యువత కోసం ఉద్యమిస్తున్న యువజన విద్యార్థి నాయకుల పై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించడం సరైన చర్య కాదని రాబోయే రోజుల్లో యువత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వానికి సరైన రీతిలో బుద్ధి చెబుతారని యువతను మోసం చేసిన జగన్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని ఆయన ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.