అమరుల స్తూపాన్ని అగౌరవ పరిచిన కాంగ్రెస్..!
అమరవీరుల స్తూపాన్ని కాంగ్రెస్ అగౌరవ పరిచింది. డ్రగ్స్ దందాతో లింక్ పెడుతూ చిల్లర రాజకీయాలకు తెరతీసింది. మొన్న రేవంత్, ఇప్పుడు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అదే పనిగా తప్పు చేస్తున్నారు. అమరుల స్తూపం ముందు శపథం చేయాలని ఒకరంటే…దాని ముందు డ్రగ్స్ ఛాలెంజ్ కి సిద్ధమా అంటూ మరొకరు నోరు జారారు. దీనిపై ఉద్యమ కారులు, తెలంగాణ పౌరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారు ఏమంటున్నరంటే…ఎవనికి పనికి వచ్చేది ఈ ఛాలెంజ్. సమాజం కు ఎం మెసేజ్ ఇస్తున్నారు ఈ నాయకులు.
మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి ఇచ్చిన ఛాలెంజ్ చూస్తుంటే నవ్వొస్తుంది.డ్రగ్ ఛాలెంజ్ వలన రాష్ట్ర ప్రజలకు ఏమైనా ఉపయోగమా…?అమరవీరులకు ఈ డ్రగ్ దందాను ఎందుకు అంటకడుతున్నారు. అమరవీరుల స్తూపం దగ్గర డ్రగ్ ఛాలెంజ్ అని అమరవీరులను కించపరుస్తూన్న నాయకులు రాష్ట్ర ప్రజానీకానికి ఎం సమాధానం చెప్తున్నారు.డ్రగ్స్ కోసమో ,డ్రగ్స్ దందా కోసమో ఈ అమరవీరుల స్తూపం ను ఏర్పాటు చేయలేదు. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష కొరకు, స్వరాష్ట్రం కోసం అమరులైన వారి జ్ఞాపకం కోసం ఏర్పాటు చేసింది. దాన్ని కూడా మీ రాజకీయ ఎత్తుగడకు, మీ రాజకీయ అవసరాలకు వాడుకోవడం అంటే సిగ్గుచేటు.ఇప్పటికైనా మీ దందాలు, మీ డ్రగ్ ఛాలెంజ్ లు ఈ అమరవీరుల స్తూపం దగ్గర కాకుండా ఎక్కడైనా పెట్టుకోండి. అమరుల ఆత్మను క్షోభకు గురిచేయకండి అని అన్నారు.