ఆక్సిజన్ స్థాయిలను పెంచే ఆహారం..

ఇప్పుడంతా ఆక్సిజన్ మయం. కొవిడ్ సోకిన వారికి ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పొయిన దాఖలాలు ఉన్నాయి. కాగా కొవిడ్‌-19 రెండో దశలో తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న సమస్య.. ఆక్సిజన్‌ స్థాయులుపడిపోవడం. కొన్నిరకాల ఆహార పదార్థాలను తరచూ తీసుకుంటే, ఆక్సిజన్‌ సామర్థ్యాన్ని సహజంగా పెంచుకుని, కరోనా ముప్పు నుంచి బయటపడవచ్చు.మినుములు : ఇందులో ఐరన్‌ పుష్కలం. వీటిని తీసుకుంటే ఆక్సిజన్‌ స్థాయులు నియంత్రణలో ఉంటాయి.నారింజ : ఇది విటమిన్‌-సిని అందించే పండు. రోగ నిరోధక శక్తినీ పెంచుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అపారం. నారింజలోని న్యూట్రియంట్లు శరీరంలో ఆక్సిజన్‌ స్థాయులను పెంచుతాయి.పుచ్చకాయ : ఈ పండులో అధిక శాతం నీరే. ఇది శరీరాన్ని హైడ్రేట్‌ చేస్తుంది. అలాగే, పుచ్చకాయలోని విటమిన్‌-ఎ రక్తహీనతను తగ్గించి, ఆక్సిజన్‌ లెవెల్స్‌ను పెంచుతుంది.స్ట్రాబెర్రీ : వీటిలోని యాంటీ ఆక్సిడెంట్స్‌, పాలీఫెనాల్‌ కాంపౌండ్స్‌ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఇందులోని విటమిన్‌-సి శరీరంలోని పోషకాహార లోపాన్ని తగ్గిస్తుంది. ఆక్సిజన్‌ స్థాయులను పెంచుతుంది.యాపిల్‌ : ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలం. వీటిలోని కొన్నిరకాల ఎలిమెంట్స్‌ శరీరంలో కొత్త కణాలు ఏర్పడటానికి తోడ్పడతాయి. యాపిల్‌ తరచూ తినడంవల్ల శరీరంలో ఆక్సిజన్‌ స్థాయి పెరుగుతుంది.కివీ : ఈ పండ్లలో యాక్టినైడిన్‌ అనే ఎంజైమ్‌ ఉంటుంది. రోగ నిరోధక శక్తిని ఇవ్వడంతో పాటు, ఆక్సిజన్‌ స్థాయులను పెంచుతుంది.మామిడిపండు : వీటిలోని విటమిన్‌-ఎ, విటమిన్‌-సి రకరకాల వ్యాధులను నివారిస్తాయి. ఆక్సిజన్‌ స్థాయులనూ పెంచుతాయి.వేయించిన జీలకర్ర : జీలకర్రను వేయించి పొడి చేసుకోవాలి. గోరువెచ్చని నీళ్లలో కలిపి తీసుకోవాలి. ఇది అనీమియాను నివారిస్తుంది. ఉప్పు కలపకుండా జీలకర్రను వేయిస్తేనే, అది ఆక్సిజన్‌ స్థాయిలను పెంచుతుంది.విటమిన్‌-డి : శరీరంలో ఆక్సిజన్‌ స్థాయులు స్థిరంగా ఉండాలంటే, విటమిన్‌-డి చాలా అవసరం. ఇది కరోనా నుంచి త్వరగా కోలుకునేలా చేస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *