ఆ నివేదికలో హైదరాబాద్ కి 11వ స్థానం..

ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ 2021 నివేదిక తాజాగా వెల్లడైంది. ఈ నివేదిక ప్రకారం హైదరాబాద్ పదకొండో స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో బెంగళూరు నిలవగా.. రెండో స్థానంలో చెన్నై నిలిచింది. మూడో స్థానంలో సిమ్లా.. నాలుగో స్థానంలో భువనేశ్వర్.. ఐదో స్థానంలో ముంబయి నగరాలు నిలిచాయి. దేశ రాజధాని ఢిల్లీ ఆరో స్థానంలో నిలిచింది. పాలనా పరంగా హైదరాబాద్ బాగుందని 70 శాతం మంది ప్రజలు చెప్పినట్లుగా పేర్కొంది. మరి.. అదే నిజమైతే.. హైదరాబాద్ టాప్ ఫైవ్ నగరాల్లో ఒకటిగా ఉండాలి కదా అలా ఎందుకు లేనట్లు..విద్యా.. ఆరోగ్యం.. వసతి సౌకర్యాలు.. ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ.. ప్రజల భద్రత.. ప్రయాణ సౌకర్యాలు తదితర అంశాలతో పాటు.. నాన్యమైన జీవనంలోనూ51 శాతంమాత్రమే రేటింగ్ లభించినట్లుగా చెబుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఆర్థిక సామర్థ్యం విషయంలో 30.05 శాతం మాత్రమే ఉండటం గమనార్హం. ఇదంతా చూసినప్పుడు హైదరాబాద్ ను మరింత నివాస యోగ్యమైన నగరంగా మార్చాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి కేసీఆర్.. మంత్రికేటీఆర్ మీదన ఉందని చెప్పాలి.హైదరాబాద్ మహానగరాన్ని విశ్వనగరంగా తీర్చి దిద్దుతామని.. దేశంలో మరే నగరానికి లేని విలక్షణత భాగ్యనగరం సొంతమన్న మాటను పాలకులు తరచూ చెబుతుంటారు. మరింత గొప్ప హైదరాబాద్ ను దేశంలోని మిగిలిన నగరాలతో పోటీ పడేలా ఎందుకు మార్చలేకపోతున్నామన్నది అసలు ప్రశ్న. హైదరాబాద్ ను మరింత త్వరగా డెవలప్ చేయాల్సిన వసరం ఎంతో ఉందన్న విషయాన్ని తాజాగా వెల్లడైన నివేదిక స్పష్టం చేస్తుందని చెప్పాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *