ఆ రాష్ట్రాల్లో లాక్ డౌన్ పొడిగింపు

దేశంలో కరోనా వ్యాప్తి ఆగడంలేదు. సెకండ్ వేవ్ వేగంగా విస్తరిస్తూనే ఉన్నది. లక్షల కేసులు నమోదవుతున్నాయి. ప్రధాన రాష్ట్రాల్లో కేసులు అధికంగా నమోదవుతుండటంతో కఠిన నిబంధనలు విధిస్తున్నాయి. లాక్ డౌన్ విధిస్తూ.. వైరస్ కు చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. కొద్దిగా అదుపులోకి వచ్చినా.. లాక్ డౌన్ లను రాష్ట్రాలు పొడిగిస్తున్నాయి. తాజాగా.. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో లాక్ డౌన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. వారం రోజుల వరకు ఈ లాక్ డౌన్ ఉంటుందని స్పష్టంచేశాయి. దేశ రాజధాని ఢిల్లీలో 2021, మే 10వ తేదీ సోమవారం నుంచి మెట్రో సర్వీసులను కూడా నిలిపి వేస్తున్నట్లు సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. మే 17 వరకు బంద్ కానున్నాయి. లాక్ డౌన్ కారణంగానే కేసుల తీవ్రత తగ్గిందనే అభిప్రాయపడ్డారు. అందుకే మరోసారి లాక్ డౌన్ పొడిగించినట్టు కేజ్రీవాల్ తెలిపారు. లాక్‌డౌన్ కారణంగా పాజిటివిటీ రేటు 35 నుంచి 23 శాతానికి తగ్గిందని, 2021, మే 8వ తేదీన 17,364 కేసులు నమోదయ్యాయని చెప్పారు. ఢిల్లీలో ఇప్పుడు ఆక్సిజన్ కొరత తగ్గిందని, వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోందన్నారు. ఇక యూపీలో కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో రెండుసార్లు లాక్ డౌన్ పొడిగించిన సర్కార్.. మరోసారి పొడిగిస్తూ.. నిర్ణయం తీసుకున్నది. మే 17వరకు ఇది అమల్లో ఉంటుందని స్పష్టంచేసింది. లాక్ డౌన్ తప్ప మరోమార్గం లేకపోవడంతో దీనిని అమలు చేస్తున్నారు. ప్రస్తుతం దేశంలోని 14 రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమలవుతున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *