ఇతర రాష్ట్రాల్లో దళిత బంధు అమలు చేస్తారాః మోత్కుపల్లి
బీజేపీ, కాంగ్రెస్ పార్టీ లకు దమ్ము ,దైర్యం ఉంటే దేశం మొత్తం దళిత బంధు పథకం అమలు చేయించాలని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు సవాల్ విసిరారు. దమ్ము దైర్యం ఉన్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని ప్రశంసించారు. అన్ని రాజకీయ పార్టీలలో ఉండే దళిత నాయకులు ఆయా పార్టీల మీద ఒత్తిడి తేవాలని, అన్ని రాష్ట్రాల్లో అమలయ్యేలా చూడాలని సూచించారు. ఎంత ఖర్చు అయినా తెచ్చి దళితులకు ఇస్తాం అన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప వారన్నారు. హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడారు. మానవత్వం కలిగిన వ్యక్తి సీఎం కేసీఆర్ అని పొగిడిన ఆయన, సీఎం కేసీఆర్ కు మరోసారి ధన్యవాదాలు తెలిపారు. రాబోయే కాలంలో అంబేద్కర్ వారసుడు గా సీఎం కేసీఆర్ నిలుస్తాడన్నారు. మరియమ్మ విషయంలో పోలీస్ అధికారులను శాశ్వతంగా సర్వీస్ నుండి తొలగించారు అంతేకాదు.. వరంగల్ లో ఒక్క ఎస్సై పై ..మరొక మహిళ ఎస్సై చేసిన ఆరోపణల విషయంలో కూడా వెంటనే స్పందించి చర్యలు తీసుకున్నారన్నారు. దమ్ముంటే దేశం మొత్తం దళిత బంధు కార్యక్రమం అమలు చేయాలని డిమాండ్ చేశారు.