ఉప ఎన్నిక ప్రచారంలోకి నారా లోకేశ్..
తిరుపతి ఎంపీ ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న టీడీపీ దానికి తగినట్టు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రస్థాయి నేతలు పార్టీ అభ్యర్థి పనబాక లక్ష్మికి మద్దతుగా క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తున్నారు. ఆపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆదివారం నుంచి పార్లమెంటు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా 4న సత్యవేడు నియోజకవర్గ పరిధిలోని వరదయ్యపాళెం మండలంలో, 5న తిరుపతి నగరంలో, 6న సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండలంలో, 7న సూళ్లూరుపేట నియోజకవర్గంలోని నాయుడుపేట పట్టణం, 8న వెంకటగిరి పట్టణంలో, 9న గూడూరు పరిధిలోని కోట మండలంలో పనబాక లక్ష్మికి మద్దతుగా ప్రచారం చేపట్టనున్నారు. 10న శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని రేణిగుంటలో పర్యటిస్తారు.