ఎంత పని చేశావు రఘునందనా..!?

అడ్డెడ్డే ఎంత ప‌ని చేశావురా
నంద‌నా.. ర‌ఘునంద‌నా!?

ఎల్ల‌ దాటినంత‌నే
ఏటి మ‌ల్ల‌న్న కాస్తా- బోడ మ‌ల్ల‌న్నాయ గ‌ద‌రా
నంద‌నా.. ర‌ఘునంద‌నా!?

నీ మ‌ట్టి- నీ నీరు- నీ ఊరునే మ‌ర‌చిపోతివాయె..
గ‌ద‌రా నంద‌నా.. ర‌ఘునంద‌నా!?

తెలంగాణ ఉద్య‌మాన్నే మ‌ట్టి క‌రిపించానంటావూ
నీ జైశ్రీమ్ అందుకు ప్ర‌త్యామ్న‌యం అంటావూ..
ఎంత ప‌ని చేశావురా నంద‌నా.. ర‌ఘునంద‌నా!?

పొరుగూళ్లో నీ పార్టీ గెలుపు కోసం
నీ యాస- నీ బాస- నీ గోస‌ల‌నే
తాక‌ట్టు బెట్టావు గ‌ద‌రా నంద‌నా.. ర‌ఘునంద‌నా!?

నీకిదియేమి పొయ్యే కాల‌మురా
నంద‌నా.. ర‌ఘునంద‌నా!?

నీ రాష్ట్ర‌మూ దాని ఆత్మ‌గౌర‌వ‌మూ క‌న్నా..
నీ పార్టీ గెలుపోట‌ములే ముఖ్య‌మ‌య్యాయి గ‌ద‌రా
నంద‌నా.. ర‌ఘునంద‌నా!?

ఏడ నేర్సినావురా ఇట్టాటి పాఠ‌మూ..
ఇదేమి న్యాయ‌మురా నంద‌నా.. ర‌ఘునంద‌నా!?

ఇంతోటి దానికి.. నీ దుబ్బాక దొడ్లోకి
ఏ ముక‌ము బెట్టుకుని..వ‌స్తావురా
నంద‌నా.. ర‌ఘునంద‌నా!?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *