కరోనా ఎఫెక్ట్..నో చేప ప్రసాదం..

ప్రతి ఏటా ఆస్తమా రోగులకు వేసే చేపమందు ఈ సంవత్సరం కూడా వేసేందుకు నిరాకరించారట. క‌రోనా వైర‌స్ ఉధృతి కార‌ణంగా ఈ ఏడాది కూడా చేప ప్ర‌సాదం పంపిణీ నిలిపివేస్తున్న‌ట్లు బ‌త్తిని హ‌రినాథ్ గౌడ్ తెలిపారు. మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ సూచ‌న మేర‌కు ఈ ఏడాది కూడా చేప ప్ర‌సాదం పంపిణీ నిలిపివేస్తున్నామ‌ని పేర్కొన్నారు. ప్ర‌తి ఏడాది మృగ‌శిర కార్తె ప్ర‌వేశం రోజున ఆస్త‌మా రోగుల‌కు చేప ప్ర‌సాదం పంపిణీ చేస్తున్న విష‌యం విదిత‌మే. క‌రోనా వ్యాప్తి కార‌ణంగా గ‌తేడాది ఈ ప్ర‌సాదం పంపిణీ చేయ‌లేదు.మృగశిరకార్తె ప్రవేశం రోజున ప్రతి ఏటా మాదిరిగానే జూన్‌ 7వ తేదీన దూద్‌బౌలిలోని తమ నివాసంలో సత్యనారాయణ వ్రతంతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి 8వ తేదీన చేప ప్రసాదాన్ని తయారు చేసి ఉదయం 10 గంటలకు తమ కుటుంబ సభ్యులందరం తీసుకుంటామని.. అలాగే తమ దగ్గరి బంధువులకు పంపిణీ చేస్తామని బ‌త్తిని హ‌రినాథ్‌గౌడ్‌ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *