కరోనా నుంచి కోలుకున్నా పలు సమస్యలు..

కొవిడ్‌ ( COVID-19 ) నుంచి కోలుకున్నాక చాలామందిలో రకరకాల సమస్యలు వస్తున్నాయి. వాటిలో జుట్టు రాలడం ఒకటి. మానసిక ఒత్తిడివల్ల కూడా జుట్టు రాలుతుందన్నది తెలిసిందే. ఈ వైరస్‌ మనిషిని మానసికంగా ఎంత ఇబ్బంది పెడుతున్నదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒత్తిడిని తగ్గించుకుని సమతుల ఆహారం తీసుకుంటే జుట్టు సమస్యనుంచి త్వరగా బయటపడొచ్చు.రోజూ ఏడు బాదం గింజలు, రెండు వాల్‌నట్స్‌ తీసుకోవాలి. బాదం గింజల్లో పుష్కలంగా ఉండే మెగ్నీషియం కేశాల పెరుగుదలకు తోడ్పడటంతోపాటు జుట్టు రాలే సమస్యను అరికడుతుంది. వాల్‌నట్స్‌లోని పొటాషియం కొత్త కణాల ఉత్పత్తికి సాయపడుతుంది.ఈ మూడు గింజలనూ ఒక్కో టేబుల్‌ స్పూన్‌ చొప్పున తీసుకోవాలి. చియా గింజల్లోని ఫాస్పరస్‌ జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది. గుమ్మడి గింజల్లో పొటాషియం, జింక్‌ వంటి ఖనిజ లవణాలు ఉంటాయి. అవిసె గింజల్లో ‘విటమిన్‌-ఇ’ అపారం. ఇవి జుట్టు, చర్మ ఆరోగ్యాన్ని కాపాడతాయి.ఒక టేబుల్‌ స్పూన్‌ స్వచ్ఛమైన కొబ్బరినూనెను పరగడుపున తీసుకోవాలి. ఇది వెంట్రుకల మొదళ్లను దృఢంగా మార్చి, జుట్టు ఒత్తుగా పెరిగేలా చేస్తుంది.వీటిలో ప్రొటీన్‌ పుష్కలం. రోజూ మూడు గుడ్ల తెల్లసొన, ఒక గుడ్డు పచ్చసొన ఆహారంలో చేర్చుకోవాలి. తెల్ల సొన మాడును శుభ్ర పరుస్తుంది. పచ్చ సొనలోని విటమిన్స్‌, మినరల్స్‌ జుట్టు ఆరోగ్యాన్ని కాపాడతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *