కరోనా వైరస్ పై వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం..

కరోనా వైరస్ వుహాన్ ల్యాబ్ నుంచే ఉద్భవించిందనే వాదనలు ఎన్నో వినిపించాయి. కానీ చైనా వాటన్నింటినీ తోసిపుచ్చింది. వుహాన్ లోని ఓ చేపల మార్కెట్ నుంచి వైరస్ వ్యాప్తి చెందిందని తెలిపింది. కానీ వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన కథనం మాత్రం అందుకు భిన్నంగా ఉంది. కరోనా వైరస్ మూలాలపై చర్చించడానికి డబ్లూహెచ్వో సమావేశం కానుంది. అందుకు ఒక్కరోజు ముందు వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ సంచలన రిపోర్టును బయటపెట్టింది. ప్రపంచంలో కరోనా వ్యాప్తి చెందడానికి ముందే వుహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో పనిచేసే ముగ్గురు శాస్త్రవేత్తలు వైరస్ బారిన పడినిట్లు ఆ నివేదిక పేర్కొంది. అంతేకాదు వారు చికిత్స కోసం వైద్యులను సంప్రదించినట్లు తెలిపింది. ఆ శాస్త్రవేత్తలు పని చేసిన కాలం అనారోగ్యానికి గురైన సమయం చికిత్స వంటివి ఆధారాలతో సహా బయటపెట్టింది. వుహాన్ ల్యాబ్ నుంచే కరోనా పుట్టిందని వస్తున్న ఆరోపణలపై పరిశోధనలు చేయడానికి ఈ నివేదిక అదనపు బలాన్ని చేకూరుస్తోంది.వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదికతో డబ్లూహెచ్ వో విచారణపై అందరికీ అనుమానం నెలకొంది. వైరస్ మూలాలను కనుగొనడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎప్పటి నుంచో దర్యాప్తు చేస్తోంది. చైనా డబ్లూహెచ్వో బృందాలు కరోనా వైరస్ ల్యాబ్ నుంచి పట్టలేదని వుహాన్ లోని చేపల మార్కెట్ నుంచి ఉద్భవించిందని ప్రకటించాయి. తాజా రిపోర్టుతో అందరికీ అనేక సందేహాలు నెలకొంటున్నాయి. ఈ నివేదికను అమెరికా చాలా సీరియస్ గా తీసుకోనుంది.ఈ నివేదికపై అమెరికా ఇప్పటివరకు ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని ఆ దేశ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రతినిధి తెలిపారు. కానీ వాల్ స్ట్రీట్ నివేదికను ప్రభుత్వం సీరియస్ గా తీసుకోనుందని తెలిపారు. కరోనా వుహాన్ ల్యాబ్ నుంచే పట్టిందని అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ పలుసార్లు వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే. చైనా వైరస్ వుహాన్ వైరస్ అని ఆయన అంటే డ్రాగన్ దేశం సీరియస్ అయింది. అలాంటిది వైరస్ మూలాలు కనుగొనడానికి డబ్లూహెచ్వోకు పూర్తిగా సహకరించడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. వుహాన్ ల్యాబ్ సమాచారం రహస్యంగా ఉంచుతోందని పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *