గురకని నివారించండి ఇలా..

గురక సాధారణంగా అందరికి వస్తుంది. అయితే మరికొంతమందిలో మరీ ఘోరంగా పెద్ద శబ్దంతో వస్తూ వుంటుంది ఈ గురక. అంతేకాదు స్థూలకాయం ఉన్నవారు ఎక్కువగా ఇబ్బందిని పడే సమస్య గురక. ఈ గురకకు కారణాలు ఒక్కొక్కరి విషయంలో ఒక్కొక్క విధంగా ఉంటాయి. ఊపిరితిత్తులలోకి గాలి తీసుకునే ముక్కు, నోరుల గాలి ద్వారాలు స్త్రీలలో కంటే మగవారిలో చాలా ఇరుకుగా ఉంటాయి. ఈ కారణం చేత ఆడవారిలో కంటే మగవారిలోనే ఎక్కువగా గురక సమస్య కనబడుతుంది. ఈ గురకను సింపుల్ చిట్కాలతో నివారించుకోవచ్చు..గ్లాసు నీటిలో 1—2 పిప్పర్ మెంట్ ఆయిల్ చుక్కలు వేసి రాత్రి నిద్రపోయే ముందు బాగా పుక్కిలించాలి. కొద్దిగా పిప్పర్ మెంట్ ఆయిల్ ను చేతివేళ్ళకు రాసుకుని వాసన చూస్తుంటే గురక తగ్గిపోతుంది. 1/2 టీ స్పూను ఆలివ్ ఆయిల్ 1/2 టీ స్పూను తేనె కలిపి రాత్రి నిదురపోయేముందు తాగాలి.మరిగే నీటిలో 4లేదా5 చుక్కలు యూకలిప్టస్ ఆయిల్ వేసి తలకు ముసుగు పెట్టి రాత్రి నిదురపోయే ముందు 10ని” పాటు ముక్కుద్వారా ఆవిరి పీల్చాలి.ఆవు నెయ్యిని రోజూ కొద్దిగా వేడిచేసి కరిగించి రెండు చుక్కల చొప్పున రెండు ముక్కురంధ్రాలలో పోసి పీల్చుతుంటే గురక తగ్గుతుంది.1/2టీ స్పూను యాలకుల చూర్ణంను ఒక గ్లాసు వేడీనీటిలో కలిపి రాత్రి నిదురపోయే ముందు తాగాలి.రెండు టీ స్పూనుల పసుపుపొడిని కప్పు వేడి పాలల్లో కలిపి రాత్రి నిదురపోయే ముందు తాగాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *