డీలా పడ్డ ఈటల రాజేందర్!
మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ హుజురాబాద్ అభ్యర్థి ఈటల రాజేందర్ డీలా పడ్డారట. తనపై ఆరోపణలు రావడంతో టీఆర్ఎస్ పార్టీకి, హుజురాబాద్ ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేసిన ఆయన వెంటనే బీజేపీలో చేరిపోయారు. ఎన్నికలకు దాదాపు ఆరు నెలల సమయం ఉన్నప్పటికీ సమయం వృధా చేయకుండా ముందుగానే ప్రచారం మొదలు పెట్టారు. ఇంటి ఇంటికి వెళ్లి తనకు సీఎం కేసీఆర్ అన్యాయం చేశారని, తప్పుడు ఆరోపణలతో పార్టీ నుంచి బయలకు గెంటి వేశారని చెప్పడం మొదలు పెట్టారు. ఇది తన ఒక్కరి సమస్య కాదని, హుజురాబాద్ ప్రజల అందరి సమస్య అని, మన ఆత్మగౌరవ సమస్య అని సానుభూతి పొందే ప్రయత్నం చేశారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికీ పాదయాత్ర మొదలు పెట్టడం అసలుకే మోసమైంది. పాదయాత్ర మొదలు పెట్టిన ఈటల రాజేందర్‌కు అటు ప్రజల నుంచి, ఇటు బీజేపీ నుంచి పెద్దగా మద్దతు లభించలేదు. గతంలో రాజేందర్ చుట్టూ ఉండే నేతలు తాము టీఆర్ఎస్ వెంటే ఉంటామని ప్రకటించడం, బీజేపీకి క్షేత్ర స్థాయిలో పెద్దగా కేడర్ లేకపోవడం వల్ల పాదయాత్ర జనాలు లేక వెలవెల పోయింది. అలాంటి సమయంలో పాదయాత్ర చేయడం అనవసరమని భావించిన ఈటల రాజేందర్ ఎలాగైనా యాత్రను నిలిపివేయాలని నిర్ణయించారట. దీనికి తోడు తన సహచరులు సైతం ఇప్పుడే వద్దు.. పాదయాత్ర అనే అస్త్రాన్ని ఎన్నికల సమయంలో వినియోగిద్దామని సూచించారట. దీనికి ఒప్పుకున్న ఈటల అందుకు అనుగుణంగా పక్కా ప్లాన్ వేసి, జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రికి చేరుకున్నాడట. అయితే టీఆర్ఎస్ పార్టీలో మంత్రిగా ఉన్నప్పుడు ఓ వెలుగు వెలిగిన ఆయన, ఇప్పుడు అదంతా గుర్తు చేసుకుంటూ సన్నిహితుల దగ్గర బాధపడుతున్నారట. ఇలాంటి సమయంలో ధైర్యంగా ఉండాలని వారు సూచిస్తున్నా.. ఈటల డీలా పడిపోతున్నారట. ఇప్పుడే ఇలా అయితే, ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక ఈటల ఎలా అవుతారలో అని సన్నిహితులు బాధపడుతున్నట్లు తెలుస్తున్నది.