పాన్ కార్డు నంబర్ లో ఉండే సీక్రెట్ కోడ్స్ ఏంటో తెలుసా?

పాన్ కార్డు అంటే ఏమిటి? పర్మనెంట్ అకౌంట్ నెంబర్(శాశ్వత ఖాఉన్న సీక్రెట్ కోడ్స్ గురుంచి. పాన్ నెంబరు 10 అంకెలతో తయారు చేయబడ్డ ఆల్ఫా న్యూమరిక్ నెంబరు. ఆర్థిక లావాదేవీలు జరిపే ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా ఈ కార్డు తీసుకోవాలి. ప్రతీ ఒక్కరికీ యూనిక్ గా పర్మనెంట్ అకౌంట్ నెంబర్ ఉంటుంది. ఈ పర్మనెంట్ అకౌంట్ నెంబర్ ఒకేసారి జారీ మాత్రమే అవుతుంది. ఇక ఎప్పటికీ అదే నెంబర్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించారా? పాన్ కార్డులోని రెండు అక్షరాలు మీ పేరు తెలుపుతాయని. పాన్ కార్డ్ సంఖ్య వెనుక చాలా సీక్రెట్ ఉంది. ఇవి వాస్తవానికి మీ వ్యక్తిగత సమాచారం గురించి ఒకటి లేదా రెండు విషయాలు చెప్పగలవు. మొదటి 5 అంకెలు అక్షరమాలలు, తరువాతి నాలుగు సంఖ్యలు, చివరిది మళ్ళీ అక్షరమాల. వాటి వెనుక ఉన్న సీక్రెట్ కోడ్స్ గురుంచి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కార్డులో ఉన్న మొదటి మూడు అక్షరాలు యాదృచ్ఛికంగా ఎంపిక చేస్తారు. అవి ఎఎఎ నుంచి జెడ్ జెడ్ జెడ్ మధ్య ఉంటాయి. ఊదా: ఎడబ్ల్యుఎస్ లేదా జెడ్ యుఐ వంటి అక్షరాల కలయిక కావచ్చు. ఇక ఇప్పుడు కార్డులో ఉన్న నాలుగు, ఐదు అక్షరాలు చాలా ముఖ్యమైనవి. పాన్ కార్డులో ఉన్న నాల్గవ అక్షరం మీ స్థితి గురించి తెలియజేస్తుంది. ఉదాహరణకు, నాల్గవ అక్షరం “పీ” అయితే, అది ఒక వ్యక్తికి చెందినది. సీ అంటే కంపెనీ పాన్ నెంబర్లు, హెచ్ అంటే హిందూ అవిభక్త కుటుంబం, ఎఫ్ అంటే ఒక సంస్థ, వ్యక్తుల సంఘం కోసం ఎ, ఒకవేళ ట్రస్ట్ తరఫున తీసుకుంటే టీ అని ఉంటాయి. ఇక ఐదో లెటర్ పాన్ కార్డ్ హోల్టర్ ఇంటిపేరు లేదా చివరి పేరులో మొదటి అక్షరం ఉంటుంది. ఉదా: దేవేందర్ కొన్నే అనుకోండి. అతని పాన్ కార్డులో XXXPK1122H అని ఉంటుంది.ఇక తర్వాత ఉండే నాలుగు అక్షరాలు 1001 నుంచి 9999 యాదృచ్ఛిక ఎంపిక చేస్తారు. పాన్ లోని పదవ అంకె మొదటి తొమ్మిది అంకెలను పరిగణనలోకి తీసుకునే ఫార్ములాపై ఆధారపడి ఉంటుంది. ఈ చివరి డిజిట్‌ను పాన్ నెంబర్ జారీ చేసే సమయంలో కంప్యూటర్ జనరేట్ చేస్తుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *