ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్..’హరీష్ రావు’..
ఆరోగ్యశాఖా మంత్రిగా హరీష్ రావు నిలోఫర్ ఆసుపత్రిలో ఐసియూని ప్రారంభించారు. మంత్రిగా మొదటి కార్యక్రమం నిలోఫర్ లోపాల్గొనటం సంతోషంగా ఉందని… ఆరోగ్య శాఖను బలోపేతం కి నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. రూ. 10 వేల కోట్లు కేటాయించి ఆరోగ్య శాఖను మరింత వృద్ధి చేసి కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు కృషి చేస్తామన్నారు. ప్రభుత్వ వైద్యం మీద ప్రజలకు మరింత విశ్వాసం పెంచాలని… కేసీఆర్ కిట్ వచ్చాక గతంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 30 శాతం ఉన్న డెలివరీ రేట్ ని 50 శాతానికి పెంచామమన్నారు. తల్లి, పిల్లల మరణాలు గణనీయంగా తగ్గాయన్నారు. 33 కోట్లతో నిలొఫర్ లో మరో 800 పడకలు అందుబాటులోకి తెస్తామన్నారు.హైదరాబాద్ నగరం 4 వైపులా నాలుగు మెడికల్ టవర్ లు తీసుకురావాలని కృషి చేస్తున్నామని….వచ్చే ఏడాది నుంచి మరో 8 మెడికల్ కాలేజీలను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు మంత్రి హరీష్ రావు కీలక ప్రకటన చేశారు. నిలోఫర్ ఆస్పత్రిలో 100 పడకల ఐసియు వార్డు ని ప్రారంభించారు. ఈ సందర్ ప్రతి జిలాలల్లో ఒక మెడికల్ కాలేజి ఉండాలని సంకల్పం పెట్టుకున్నట్లు తెలిపారు హరీష్ రావు.