బరువు తగ్గించే పానీయాలు..

పలువురు ఎంతో సతమతమవుతుంటారు అధిక బరువుతో. ఎన్నో అనారోగ్యాలు వస్తుంటాయి ఈ అధిక బరువు వల్ల ..మరి తగ్గడం ఎలా.. డైట్, ఎక్స‌ర్ సైజ్ ల‌తో ఒళ్లు హూనం చేసుకున్నా బ‌రువు స‌మ‌స్య ఇంకా వేధిస్తుంటే ఈ ఐదు పానీయాల‌తో బ‌రువు తగ్గించుకోవ‌చ్చ‌ని సూచిస్తున్నారు. ఆ పానీయాలేంటో చూసేద్దామా..

ప్రొటీన్ డ్రింక్స్ : ప్రొటీన్ డ్రింక్స్ తో పొట్ట నిండిన భావం క‌ల‌గ‌డంతో అద‌నంగా ఆహారం తీసుకోరు. త‌క్కువ కేల‌రీల ఆహారంతో బ‌రువును చ‌క్క‌గా నియంత్రించ‌వ‌చ్చు. ప్రొటీన్ డ్రింక్ స‌ప్లిమెంట్ల‌ను తీసుకోవ‌డంతో పాటు అర‌టి, పీన‌ట్ బ‌ట‌ర్ వంటి ప‌దార్ధాల‌తో ఇంట్లోనే వీటిని త‌యారు చేసుకోవ‌చ్చు.

గ్రీన్ టీ : యాంటీఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉండే గ్రీన్ టీ కొవ్వు క‌రిగేందుకు ఉప‌క‌రించ‌డ‌మే కాకుండా బ‌రువును త‌గ్గించే ప‌లు ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటుంది.

బ్లాక్ టీ : బ‌రువు త‌గ్గాల‌ని కోరుకునే వారు పాల‌ను విడిచిపెట్టి బ్లాక్ టీ తాగ‌డం మెరుగైన ఫ‌లితాల‌ను ఇస్తుంది. బ్లాక్ టీ వెయిట్ లాస్ డ్రింక్ గా నిపుణులు చెబుతున్నారు. ఈ టీలో ఉండే పాలిపినాల్స్ బ‌రువును నియంత్రిస్తాయ‌ని ప‌బ్ మెడ్ సెంట్ర‌ల్ లో ఓ అథ్య‌య‌నం ప్ర‌చురిత‌మైంది.

యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్ డ్రింక్స్ : ఈ పానీయంతో జీవ‌క్రియ‌లు పెరిగి కొవ్వు క‌రిగిపోతుంది. యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్ లో బ‌రువును త‌గ్గించే ఔష‌ధ గుణాలు ఉన్నాయ‌ని ప‌లు అథ్య‌య‌నాలు వెల్ల‌డించాయి.

వెజిట‌బుల్ జ్యూస్ : ఇక ఇండ్ల‌లో సుల‌భంగా దొరికే కూర‌గాయ‌ల జ్యూస్ కూడా బ‌రువును తగ్గించ‌డంలో ఉప‌క‌రిస్తుంది. క్యారెట్, కీరా, పాల‌కూర వంటి కూర‌గాయలు, ఆకుకూర‌ల ర‌సాలు ఆరోగ్యాన్ని కాపాడ‌టంతో బ‌రువును అదుపులో ఉంచుతాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *