మేడారం జాత‌ర‌కి రూ.75కోట్లు..

రెండేళ్లకోసారి మేడారంలో జాత‌ర అంగ‌రంగ వైభ‌వంగా జ‌రుగుతుంద‌ని తెలిసిన విష‌య‌మే. వ‌చ్చే ఏడాదికి మేడారం జాత‌ర‌ని జ‌రిపేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ జాత‌ర ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీల జాతర. దేవతలకు బెల్లం సమర్పించే అతిపెద్ద గిరిజన పండుగ. సమ్మక్క, సారలమ్మ దేవతలను దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో హాజరవుతారని అధికారులు భావిస్తున్నారు. ఫిబ్రవరి 16 వ తేదీన సారలమ్మ కన్నెపల్లి నుంచి గద్దెపైకి వస్తుంది. ఇక 17న చిలకలగుట్ట నుంచి సమ్మక్క గద్దెపైకి విచ్ఛేస్తుంది. 18న భక్తులకు అమ్మవార్లు దర్శనమిస్తారు. చివరి రోజు 19న అమ్మవార్లు తిరిగి వనప్రవేశం చేస్తారు.ఈ మేరకు ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జాతర ఏర్పాట్లను చేస్తున్నారు.ఈ జాతర 2022 ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరగనుంది. తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన వనదేవతల జాతర రెండేళ్లకోసారి జరుగుతుంది. కోవిడ్‌ మొదలైన తర్వాత ఇది మొదటి మేడారం జాతర.. దీంతో అధికారులు కరోనా నిబంధనలు పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటూ తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం జాతర కోసం రూ.75 కోట్ల నిధులను విడుదల చేసింది.ఈ మహా జాతరకు తెలంగాణ నుంచే కాకుండా ..ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *