రెండు రోజుల్లో తెలంగాణ‌ కేబినెట్ మీటింగ్..ఉద్యోగాల నోటిఫికేష‌న్ల‌కి ప‌చ్చ‌జెండా..

ఎట్ట‌కేల‌కు తెలంగాణ‌లో ఉద్యోగాల‌కు నోటిఫికేష్ల‌పై ఓ క్లారిటీ రానుంది. ఈ నెల 14న సీఎం కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న కేబినేట్ మీటింగ్ జ‌ర‌గ‌నుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి.. నిర్ణయం తీసుకోనున్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి, తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశముంది. ఈ నెల లోపు పంటలసాగుపై అవగాహన, ఉద్యోగాల భర్తీపై నోటిఫికేషన్ ఇవ్వాలన్న అంశంపై ఈ సమావేశంలో చర్చించే అవకాశముంది. ఉద్యోగాల భర్తీపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇ్పటికే క్లారిటీ ఇచ్చారు. నిరుద్యోగ సమస్యపై ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్న నేపథ్యంలో నోటిఫికేష‌న్ల‌కి కేబినెట్ లో పచ్చజెండా ఊపనున్నారు. దాదాపు 70వేల పోస్టులకు నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు సమాచారం. ఎప్పటిలోగా ఈ నియామకాలు పూర్తి చేయాలన్నదానిపై కూడా మంత్రివర్గంలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలియవచ్చింది. ఇదిలా ఉండగా… టీజీవో (TGO) నేతలతో తెలంగాణ సీఎం కేసీఆర్ (kcr) భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీపై సీఎం చర్చించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. జోనల్‌ వ్యవస్థలో ఉద్యోగుల సర్దుబాటు అనంతరం ఏర్పడే ఖాళీలను కూడా పరిగణనలోకి తీసుకొని భారీ స్థాయిలో ఉద్యోగ నియామక ప్రకటనలు ఇస్తామని కేసీఆర్ చెప్పారని తెలిపారు. ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకు ఉద్యోగులందరూ సహకరించాలని సీఎం కోరినట్టు టీజీవో నేతలు తెలిపారు. ఉద్యోగులకు ఐచ్ఛికాలు ఇచ్చి సీనియార్టీ ప్రాతిపదికన జిల్లాలకు కేటాయిస్తారని, అందుకు ప్రభుత్వానికి సహకరిస్తామని టీజీవోలు వెల్లడించారు. ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న డీఏ విడుదల చేయాలని ముఖ్యమంత్రిని కోరామని… దీనిపై సీఎం సానుకూలంగా స్పందించారని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *