రేవంత్ రాక.. కెసిఆర్ కే మంచిదట..!
పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఎంపిక ఎవరికి లాభం అంటే..తెలంగాణ సీఎం కేసీఅర్ కే అంటున్నారు రాజకీయ నిపుణులు. నాదాన్ దుష్మన్ అంటూ కేసీఅర్ ఇన్నాళ్లు ప్రతిపక్షాలను తిట్టిపోస్తుండేవారు. తన స్థాయికి తగ్గ వారు ఎవరు లేరని అంటుండేవారు. అయితే ఇప్పుడు రేవంత్ రూపంలో బలమైన ప్రతిపక్షంగా కాంగ్రెస్ మారుతుందని అంచనాలున్నాయి. అయితే రేవంత్ పిసిసి చీఫ్ గా పగ్గాలు చేపట్టడం ఇప్పటికిప్పడు టీఆరెఎస్ కే కలిసి వస్తుందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. హుజరాబాద్ ఎన్నికల్లో ఏకపక్షంగా గెలుపు సాధించాలని చూస్తున్న ఈటలకు ఇది ఇబ్బందిని తెచ్చి పెడుతుందని భావిస్తున్నారు. రేవంత్ వల్ల కాంగ్రెస్ గట్టి పడితే, అక్కడి ఎన్నికల్లో కౌశిక్ రెడ్డి పెద్ద సంఖ్యలో ఓట్లు కొల్లగొడతారు. ఇప్పటి వరకు టీఆరెఎస్, బిజెపి మధ్య ఉన్న పోరు.. రేవంత్ వల్ల త్రిముఖ పోరుగా మారుతుంది. అపుడు టీఆరెఎస్ వ్యతిరేక ఓటు కాంగ్రెస్, బీజెపీ పంచుకోగా… మద్దతు ఓటు ఏక పక్షంగా కారుకు పడనున్నది. దీంతో టీఆరెఎస్ కు మెజార్టీ పెరుగనున్నది..