వర్షాకాలంలో కరోనాతో జాగ్రత్త..

సాధారణంగానే వర్షాకాలంలో సీజన్ వ్యాధులు వస్తుంటాయి. ఇప్పుడు కరోనా కాలం కదా అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు డాక్టర్స్. నైరుతి రుతుపవనాల రాక‌తో వ‌ర్షాలు కురుస్తాయి. వీటితోనే ఎన్నో వ్యాధులు కూడా మ‌న‌ల్ని చుట్టుముడ‌తాయ‌ని మ‌రిచిపోవ‌ద్దు. అందులోనూ ప్ర‌స్తుత క‌రోనా వైర‌స్ వ్యాప్తి ఎక్కువ‌గా ఉన్న ఈ రోజుల్లో మ‌రింత జాగ్ర‌త్త‌లు అవ‌స‌రం.రుతుప‌వ‌నాలు ప్ర‌వేశించ‌డంతో వ‌ర్షాలు కుర‌వ‌డం, వాతావ‌ర‌ణం పూర్తిగా చ‌ల్ల‌బ‌డ‌టంతో.. వైర‌స్‌లు దాడి చేస్తుంటాయి. త‌రుచుగా వ‌ర్షంలో త‌డుస్తూ ఉంటే జ‌లుబు, ద‌గ్గుతో పాటు శ్వాస‌కోశ స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. రుతుపవనాల సమయంలో రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. అందుక‌ని క‌రోనా వ్యాప్తి ఉన్న ఈ స‌మ‌యంలో మ‌రిన్ని జాగ్ర‌త్త‌లు పాటించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉన్న‌ది.వాన‌లు ప‌డుతుండ‌టంతో ఇల్లు, ప‌రిస‌ర ప్రాంతాల్లో చిత్త‌డిగా ఉంటుంది. త‌డి ఎక్కువ‌గా ఉండే ప్రాంతాల్లో వైర‌స్‌, బ్యాక్టీరియాలు వృద్ధి చెంద‌డానికి ఆస్కారం ఉంటుంది. అందుక‌ని వ‌ర్షాకాలంలో ఇంట్లో త‌డి లేకుండా చూసుకోవాలి. ఇళ్లంతా ప‌రిశుభ్రంగా ఉంచుకోవాలి.ఇంట్లోకి ధార‌లంగా వెలుతురు వ‌చ్చేలా వెంటిలేష‌న్ ఏర్పాటుచేసుకోవాలి. సూర్య‌రశ్మి ఇంట్లోకి వ‌చ్చేలా చూసుకోవాలి. ఇంట్లో నీరు నిలువ లేకుండా చూడాలి. త‌లుపులు, కిటికీలు తెరిచిఉంచుకోవాలి.వ‌ర్షం కురియ‌డంతో ఇంటి గోడ‌లు చెమ్మ‌కు గుర‌వుతాయి. గోడ‌లు నీటిని పీల్చుకోవ‌డంతో వైర‌స్ త‌యార‌వుతుంది. అందుక‌ని గోడ‌లు న‌ల్ల‌గా మారుతుండ‌టాన్ని గమ‌నిస్తూ ఉండాలి.ఇంటి వెన‌కాల‌, ఇంటిపైనా ప‌నికిరాని వ‌స్తువుల్లో వ‌ర్షం నీరు నిలువ కాకుండా చూసుకోవాలి. లేనిప‌క్షంలో వీటిలో సూక్ష్మ‌క్రిములు, దోమ‌లు వృద్ధి చెంది ఇత‌ర వ్యాధులు రావ‌డానికి కార‌ణ‌మ‌వుతాయి.ఆహారం తీసుకోవ‌డానికి ముందు, బాత్రూంకు వెళ్లిన ప్ర‌తీసారి చేతుల‌ను స‌బ్బుతో శుభ్రంగా క‌డుక్కోవ‌డం అల‌వాటు చేసుకోవాలి. ద‌గ్గు, తుమ్ములు వ‌చ్చిన‌ప్పుడు కూడా చేతుల‌ను శుభ్ర‌ప‌రుచుకోవాలి.వేడిగా ఉన్న ఆహారాల‌ను తీసుకోవ‌డం చాలా మంచిది. చ‌ల్ల‌టి ప‌దార్థాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ఆరోగ్య స‌మ‌స్య‌లు వచ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. ఫ్రిడ్జ్‌లో దాచిన ఆహారాల‌ను దూరం పెట్టండి.స‌రిగా ఉడ‌క‌ని మాంసాహారం ప‌దార్థాలు తిన‌కుండా చూసుకోవాలి. బాగా ఉడికిన మాంసాన్ని తిన‌డం ఆరోగ్యానికి శ్రేయ‌స్క‌రం అనేది మ‌రిచిపోవ‌ద్దు.శ్వాస ప్ర‌క్రియ బాగా జ‌రిగేలా చూసుకోవాలి. అందుకు యోగా, ప్రాణాయామం అల‌వ‌ర్చుకోవాలి. సిగ‌రెట్ తాగ‌డం మానుకోవాలి. ప‌చ్చిగా ఉండే దుస్తులు ధ‌రించ‌కుండా చూసుకోవాలి.ఇంట్లో మొన్న‌టి వర‌కు వాడి ప‌క్క‌న పెట్టిన కూల‌ర్‌లో నీరు ఉన్న‌ట్ల‌యితే తొల‌గించాలి.ఫ‌ర్నీచ‌ర్ గోడ‌ల‌కు తాకేట్లుగా ఉంచ‌కూడ‌దు.బ‌య‌టి ఆహారాల‌ను తీసుకోవ‌డం మానుకోవాలి. ఇంట్లోనే వేడివేడిగా ఆహారాల‌ను త‌యారుచేసుకుని ఎప్ప‌టిక‌ప్పుడు తినాలి. కూర‌గాయాలు, పండ్లు కోసిన వెంట‌నే తినేలా చూసుకోవాలి. వంట‌ల‌కు ముందు కూర‌గాయ‌ల‌ను శుభ్ర ప‌రుచుకోవాలి. వంట‌ల్లోకి ఎక్కువ‌గా వేరుశ‌న‌గ‌, కొబ్బ‌రి, సోయాబీన్ నూనెల‌ను వాడుకోవాలి.చివ‌ర‌గా, ఎక్కువ‌గా నిద్ర‌పోయేలా ప్లాన్ చేసుకోవాలి. అదేవిధంగా ఎక్కువ‌గా నీరు తాగ‌డం అల‌వ‌ర్చుకోవాలి. అయితే, ఎక్కువ‌గా చ‌ల్ల‌టి నీరు తాగొద్దు. అల్లం, మిరియాలు, వెల్లుల్లి, దాల్చిన‌చెక్క, ఏల‌కులు, ల‌వంగాలతో నీటిని వేడి చేసి తాగ‌డం వ‌ల్ల వివిధ ఆరోగ్య స‌మ‌స్య‌ల‌ను రాకుండా చూసుకోవ‌చ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *