వలస జర్నలిస్టులు ఎగతాళి మానుకోవాలి..

హైదరాబాద్ ప్రెస్ క్లబ్ కు యాభై సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసినప్పుడే బైలాస్ రాసుకుంటారు. కాకపోతే ఆ తర్వాత, తర్వాత వచ్చిన మార్పులు, సూచనలు, సలహాలకు అనుగుణంగా కొన్నింటిని మార్చుకుంటారు. కానీ ప్రెస్ క్లబ్ బైలాన్ ను రాసిందే TUWJ యూనియన్ అని ఒక సీనియర్ జర్నలిస్టు పోస్టింగ్. అసలు TUWJ ఎప్పుడు ఏర్పడిందో కూడా ఆయన తెలుసో లేదో…, TUWJ ప్రెస్ క్లబ్ బైలాస్ ను రాయలేదు. టియుడబ్ల్యుజె చేసింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రెస్ క్లబ్ అనేది ఏ సంఘానికి అనుబంధంగా ఉండకూడదని, ప్రెస్ క్లబ్ లో అన్ని సంఘాలవారు, అందరు జర్నలిస్టులు సభ్యులుగా ఉంటారు కాబట్టి దానిని అటానమస్ చేయాలని డిమాండ్ చేసింది. డిమాండ్ కు అనుగుణంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ను APUWJ కు అనుబంధంగా రాసుకున్న నిబంధనను, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మార్పించింది. మిగతా బైలాస్ లోని అంశాలు అన్నీ కూడా అంతకు ముందెన్నడో కొన్ని దశాబ్దాల కింద రాసుకున్నవి. ఒకటి, రెండు ఆ తర్వాత మార్చుకుంటే మార్చుకున్నారేమో కానీ, మొత్తం బైలాస్ అంతా TUWJ నే రాసిందని ఆ సీనియర్ జర్నలిస్టు సెలవిస్తున్నాడు. ఇదీ వీరికి క్లబ్ మీద, క్లబ్ నియమనిబంధనల మీద ఉన్న జ్ఞానం. ఏం చేస్తాం మరి, ఇలాంటి వాళ్లు ఏదో ఉద్దరించి, ఏదో చేస్తారట. బై లాస్ ఎప్పుడు రాశారో ముందు మీరు తెలుసుకుంటే మీ సినియారిటీకి, మీకూ గౌరవం ఉంటుందేమో.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *