విటమిన్ సితో ఎన్నో లాభాలు..

మన శరీరానికి అన్ని పోషకాలు అందింతేనే శరీరం నిగ నిగలాడుతూ ఉంటుంది..లేదంటే వెల వెల బోతోంది.. విటమిన్‌-సి వల్ల కలిగే లాభాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇది ఫ్రీ ర్యాడికల్స్‌ని న్యూట్రలైజ్‌ చేయగలదు. ఇందులోని పొటెంట్‌ ఎల్‌ ఆస్కార్బిక్‌ యాసిడ్‌ చర్మంపై ఉండే నల్ల మచ్చలను తగ్గించడంలో సాయపడుతుంది. సూర్యరశ్మి వల్ల కలిగే ట్యాన్‌, నిర్జీవాన్ని దూరం చేస్తుంది. అలాగే వయసు, సూర్యరశ్మి కారణంగా చర్మంలోని కొలాజెన్‌ సింథసిస్‌ తగ్గి చర్మంపై ముడతలు ఏర్పడతాయి. విటమిన్‌-సి ఈ సమస్యలను నియంత్రించగలదు. ఇప్పటికే మార్కెట్లో విటమిన్‌-సి స్కిన్‌కేర్‌ ప్రొడక్ట్స్‌కు డిమాండ్‌ పెరిగింది. అయితే, వీటిని కొనేటప్పుడు ప్యాకేజింగ్‌, కలర్‌, స్మెల్‌ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. స్కిన్‌కేర్‌ ప్రొడక్ట్స్‌ తెలుపు నుంచి పసుపు, నారింజ, బ్రౌన్‌ రంగుల్లోకి మారినా, పులిసిన వాసన వచ్చినా వెంటనే వాటి వాడకాన్ని ఆపేయాలంటున్నారు. అన్నిటికీ మించి మనం తీసుకునే ఆహారంలో విటమిన్‌-సి కంటెంట్‌ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలని సలహా ఇస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *