వైట్ ఫంగస్ తో ముప్పు లేదట..

కరోనాకి తోడు పలు రకాల ఫంగస్ లు వ్యాపిస్తున్నాయి. కాగా బ్లాక్..వైట్..తో పాటు ఎల్లో ఫంగస్ కూడా అలజడి రేపుతోంది. కాగా వైట్ ఫంగస్ తో భయపడాల్సిన పని లేదట. కాగా వైట్‌ ఫంగస్‌ శాస్త్రీయ నామం కాండిడా అల్ఫికాన్సీ. ఇది సహజంగానే మన శరీరం లోపల, బయట ఉంటుంది. కానీ అది అతిగా పెరిగితే ఆనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. ల్యాబొరేటరీలో దాన్ని పరిశీలిస్తే తెల్లగా కనిపిస్తుంది. అందువల్ల ఈ ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ను వైట్‌ ఫంగస్‌ అంటారు. ఇది కంటి గుడ్డులోని వివిధ బాగాలను ప్రభావితం చేస్తుంది. శరీరంలో ఏ భాగానికైనా వ్యాపిస్తుంది. వైట్‌ ఫంగస్‌ కంటిలోని రెటీనాపై ప్రభావం చూపుతుంది. కండ్ల్లు ఎర్రబడి నొప్పి వస్తుంది. కంటిముందు నల్లని నీడ ఛాయలు లేదా కంటి ముందు తేలియాడుతున్నట్టు ఉంటుంది. ఇది కొంతమేర దృష్టిలోపానికి దారితీస్తుంది. కరోనా సోకిన వెంటనే లేదా కోలుకున్నవారిలో వైట్‌ ఫంగస్‌ ప్రభావం కనబడుతుంది. దీని ప్రభావంతో కొవిడ్‌ నుంచి కోలుకున్న 1 నుంచి 3 నెలల్లో కంటిచూపు తగ్గే అవకాశం ఉన్నది. కరోనా చికిత్సకే కాకుండా ఇతర దీర్ఘకాలిక వ్యాధుల నియంత్రణకు స్టెరాయిడ్లు అధిక డోస్‌లో వాడటం, ఎక్కువ రోజులు దవాఖానల్ల్లో ఉండటంవంటి కారణాలవల్ల వ్యక్తుల్లో రోగనిరోధకశక్తి తగ్గిపోతుంది. వైరస్‌లను ఎదుర్కొనే శక్తిలేనివారిలో ఇలాంటి ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్ల ప్రభావం మరింత పెరుగుతుంది. ఈ వ్యాధి కండ్లకు మాత్రమే సోకితే ప్రమాదం ఉండదు. శరీరానికి మొత్తం సోకితే ప్రాణాంతకం. కొవిడ్‌ నుంచి కోలుకున్న రోగుల్లో వైట్‌ ఫంగస్‌, బ్లాక్‌ ఫంగస్‌ను పోల్చడానికి సరైన గణాంకాలు లేవు. వైట్‌ ఫంగస్‌ కేసులు ప్రస్తుతం చాలా అరుదుగా ఉన్నాయి. మ్యుకోర్‌ మైకోసిస్‌ (బ్లాక్‌ ఫంగస్‌) ప్రధానంగా కంటి చుట్టూ ఉండే కణజాలం, ముక్కులోని సైనస్‌పై దాడిచేస్తుంది. అందుకు భిన్నంగా వైట్‌ ఫంగస్‌ కంటి లోపలి కణజాలం విట్రస్‌ జల్‌, రెటినాను ప్రభావితం చేస్తుంది. వైట్‌ ఫంగస్‌ గురించి పూర్తిగా తెలుసుకొంటే భయపడాల్సిన పనిలేదు. సకాలంలో వ్యాధిని గుర్తించి చికిత్స అందించగలిగితే ఎలాంటి ప్రమాదముండదు.వైట్‌ ఫంగస్‌ను నియంత్రించేందుకు ఇంట్రాకోక్యురీ సర్జరీ, కంటిలోపల యాంటీ ఫంగల్‌ ఇంజెక్షన్లు, నోటి ద్వారా యాంటీ ఫంగల్‌ మందులను అందించాలి. రక్తం లో చక్కెర స్థాయిలను నియంత్రించాలి. దీన్ని ఎదుర్కోవాలంటే రోగి రోగ నిరోధకశక్తి పెంచడం చాలా ముఖ్యం.తక్కువ రోగ నిరోధక శక్తి ఉండి, రక్తంలో అధికంగా షుగర్‌స్థాయి ఉన్న రోగులకు ఎక్కువ ప్రమాదం ఉంటుంది. కరోనా వైరస్‌ సోకి కోలుకున్న తర్వాత (మొదటిసారి జ్వరం వచ్చిన 6 నుంచి 8 వారాల లోపు) ఇది సోకవచ్చు. ఎందుకంటే ఈ కాలంలో రోగిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. డయాబెటిస్‌, సిస్టమెటిక్‌ ఇమ్యునో సస్ప్రెషన్‌ (తక్కువగా రోగ నిరోధక శక్తి), ఇతర క్రానిక్‌ వ్యాధులతో బాధపడుతున్నవారు ఈ ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యే అవకాశాలు ఎక్కువ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *