వ్యాక్సిన్ వ్యాక్సినే… మాస్క్ మాస్కే..కేటీఆర్..

తమ్ముడు తమ్ముడే..పేకాట పేకాటే లెక్క.. యువ నాయకుడు,ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నాటి నుండి నేటి వరకు కూడా ఎక్కడకు వెళ్లిన ,ఎ వేదిక మీద ప్రసంగం చేసిన మాస్క్ మాత్రం తప్పనిసరి అంటాడు టీఆరెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కరోనా ఫీక్ లెవెల్ కు వెళ్లిన నాటి నుండి నేటి వరకు అందరితో కలిసి తిరుగుతారు, కానీ మాస్క్ దరిస్తారు అందుకే కావచ్చు ఇప్పటివరకు కూడా కరోనా ఆయనను దరి చేరలేదు. మొన్నటికి మొన్న జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారంలో సైతం అనేక వేదికలపై ప్రసంగించారు కానీ మాస్క్ మాత్రం తీయలేదు అందుకే ఎంతో మంది ప్రజాప్రతినిధులకు కోవిడ్19 సోకిన కేటీఆర్ కు మాత్రం రాలేదు అంటే మాస్క్ మాత్రమే కాపాడింది అని చెప్పవచ్చు.. అయితే వ్యాక్సిన్ వచ్చింది కదా కరోనా పోయింది లే అంటే పొరపాటే దానికి నిదర్శనం మళ్ళీ పెరుగుతున్న కేస్ ల సంఖ్య నే. అట్లాగే  వ్యాక్సిన్ వేయించుకున్నాను నాకు ఇక కరోనా రాదు అంటే కూడా పప్పులో కాలు వేసినట్టే ఎందుకంటే కొంతమంది కి రెండో డోస్ వేయించుకున్నాక కూడా పాజిటివ్ రావడామే దానికి సాక్ష్యం. బీ కేర్ ఫుల్. కరోనా ను వ్యాక్సిన్ వచ్చింది ,నేను వ్యాక్సిన్ వేయించుకున్న ఆయిన సోషల్ డిస్టన్స్ తోపాటు తప్పనిసరిగా మాస్క్ పెట్టుకుంటా అని మనలో ఉండాలి అప్పుడు మాత్రమే కరోనా ను నియత్రించవచ్చు అంటున్నారు వైద్యులు. కరోనా జాగ్రత్తలు పటిద్దాం కోవిడ్ ను తరిమికొడదాం.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *