హుజురాబాద్‌లో రోజూ బీరు, బిర్యానీలు..
ఎన్నికల కోడ్ కూయకముందే హుజురాబాద్‌లో ఎన్నికల సందడి వచ్చింది. బయటికి సైలెంట్‌గా ఉంటూ, బ్యాంగ్రౌండ్ వర్క్ చేస్తూ సడెన్‌గా ఎన్నికలకు పోయి గెలుపు సాధించడం సీఎం కేసీఆర్‌కు ఉన్న అలవాటు. సీఎం దగ్గరే మంత్రిగా ఉన్న ఈటలకు ఈ విషయం బాగా తెలుసు. అందుకే ముందుగానే తన ప్రచారం మొదలు పెట్టారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తనదే గెలుపు కావాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. అయితే ఇదంతా బాగానే ఉన్నప్పటికీ హుజురాబాద్‌లో ప్రతి రోజూ దసరా పండుగే నడుస్తున్నదట. ఫంక్షన్ హాళ్లు, కాలేజీలు, ఖాళీ ప్రదేశాలు ఎక్కడ చూసినా బీరు, బిర్యానీ పథకం నడుస్తున్నదట. ప్రతి ఇంటికి గడియారాలు పంచడం, లోకల్ లీడర్లకు డబ్బులు ఇవ్వడం వంటి ఓట్లను మభ్యపెట్టే కార్యక్రమాలకు ఈటల తెరలేపారట. మరోవైపు టీఆర్ఎస్, కాంగ్రెస్ మాత్రం ఈ తరహా కార్యక్రమాలను ఇప్పటికీ మొదలు పెట్టలేదట. రాజేందర్ అన్న ఇంత ఖర్చు చేస్తున్నడు.. ఇప్పుడే ఉన్న డబ్బంతా ఖర్చు చేసుకుంటే, రేపు ఎన్నికల సమయంలో ఎలా..? అని సన్నిహితులు అనుకుంటున్నారట. ఎకరం భూమి అమ్మితే చాలు ఎన్నికల్లో గెలుస్తానని గతంలో ఒక సభలో ఈటల స్వయంగా చెప్పారు. మరి ఇప్పుడు ఎన్ని ఎకరాలు అమ్ముకుంటాడో ఈటల.. అని హుజురాబాద్ ప్రజలు అనుకుంటున్నారట.