ఒకే దెబ్బకి బీజేపీని, కాంగ్రెస్ ని ఇరుకున పెట్టేందుకు కేసీఆర్ ఈ ప్లాన్!

ఒకే దెబ్బకి బీజేపీని, కాంగ్రెస్ ని ఇరుకున పెట్టేందుకు కేసీఆర్ ఈ ప్లాన్!!!!!!
ఈటల ఆత్మగౌరవం నినాదం అందుకున్నారు. నిరంకుశత్వానికి, ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న పోరుగా హుజూరాబాద్ ఉప పోరుని అభివర్ణిస్తున్నారు. అటు కేసీఆర్ మాత్రం మరోసారి తెలంగాణ అంశాన్ని ఎత్తుకున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల వేళ కేసీఆర్ మరోసారి తెలంగాణ పోరాటాన్ని గుర్తు చేస్తున్నారు. ఆనాటి అంశాలన్నిటినీ తెరపైకి తెస్తున్నారు.”తెలంగాణ అప్పనంగా రాలేదు. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను. నన్ను తిట్టిన తిట్లు ప్రపంచంలో ఎవ్వర్నీ తిట్టి ఉండరు.. నా ముక్కును, వ్యక్తిగత విషయాల్ని కూడా వదల్లేదు. నన్ను విమర్శించిన వాళ్ల ముందే తెలంగాణ సాధించి చూపించాను. తెలంగాణ ప్రజలు గర్వంగా బతకాలనేదే నా ఉద్దేశం.” కేసీఆర్ ప్రసంగం ఇలా సాగుతోంది.మధ్యలో రేవంత్ రెడ్డి మాటలు, చేతలు పార్టీకి ఊపు తెస్తున్నా.. హూజురాబాద్ పోటీ మాత్రం ప్రధానంగా ఈటల, టీఆర్ఎస్ మధ్యేననే విషయం మాత్రం వాస్తవం.పార్టీనుంచి బయటకొచ్చిన మొదట్లో ఈటల బీసీ కార్డు ఉపయోగించాలనుకున్నారు. తాను బీసీనని, ముదిరాజ్ బిడ్డనని, అవమానాల్ని సహించేది లేదని కులం కార్డు బయటకు తీశారు. అయితే ఆయన హుజూరాబాద్ లో బీసీ, హైదరాబాద్ లో ఓసీ అంటూ టీఆర్ఎస్ నేతలు కౌంటర్ ఇచ్చారు. హుజూరాబాద్ లో తనపై మరో బీసీ అభ్యర్థిని బరిలో దింపే అవకాశం ఉందని కూడా సంకేతాలందడంతో తన ఆత్మగౌరవాన్ని బయటకు తీశారు ఈటల.కేసీఆర్ ది నిరంకుశ ధోరణి అని, తన ఆత్మగౌరవాన్ని చంపుకుని బతకలేకే బయటకు వచ్చానని చెప్పుకుంటున్నారు. మరి ఉద్యమంలో, ఆ తర్వాత ప్రభుత్వంలో కూడా ఆత్మగౌరవాన్ని చంపుకునే ఈటల బతికారా అనేది తేలాల్సి ఉంది. మొత్తమ్మీద ఈటల ఆత్మగౌరవ నినాదం, కేసీఆర్ చేసి చూపెడతానంటున్న అభివృద్ధి ముందు నిలబడుతుందా లేదా అనేది తేలాల్సి ఉంది.
కేసీఆర్ తెలంగాణ నినాదం ఇప్పుడెందుకు..?
ఈటల స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే కేసీఆర్ తెలంగాణ ఉద్యమ నినాదాన్ని తెరపైకితెచ్చేవారు కాదేమో. అయితే ఆయన బీజేపీ తరపున బరిలో దిగుతున్నారు. దీంతో బీజేపీని తెలంగాణ ఉద్యమ వ్యతిరేకిగా చూపేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ సాధనలో బీజేపీ పాత్ర లేదని, ఇప్పుడా పార్టీకి ఎవరూ ఓటు వేయొద్దనేది కేసీఆర్ కాన్సెప్ట్.ఒకే దెబ్బకి బీజేపీని, కాంగ్రెస్ ని ఇరుకున పెట్టేందుకు కేసీఆర్ ఈ ప్లాన్ వేశారు. తన కష్టాల్ని, త్యాగాల్ని మరోసారి గుర్తు చేస్తున్నారు, సింపతీ కోసం ప్రయత్నిస్తున్నారు. మరి హుజూరాబాద్ లో ఈటల ఆత్మగౌరవం గెలుస్తుందా, లేదా తెలంగాణ సెంటిమెంట్ నిలబడుతుందా అనేది చూడాలి.
దేవేందర్ కొన్నే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *