డైనోసర్ పన్ను దొరికిందట..
అప్పట్లో డైనోసర్ లు ఉండేవని విన్నాం..ఎన్నో సినిమాలు కూడా వచ్చాయి డైనోసర్ లపై..అయితే నిజంగానే డైనోసర్ లు ఉన్నాయి అని నిరూపించే సంఘటన జరిగింది. అమెరికాలోని కొలరాడో రాష్ట్రానికి చెందిన విద్యార్థికి డైనోసర్ పన్ను దొరికింది. హైకింగ్ చేస్తున్న సమయంలో తనకు డైనోసర్ పన్ను కనిపించినట్టు జోనథన్ అనే విద్యార్థి తెలిపాడు. ‘ఇలాంటిది దొరుకుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. నేను హైకింగ్ చేస్తుంటే ఒక రాయి మెరుస్తూ కనిపించింది. ఆ రాయి డైనోసర్ పన్ను అని ఆ సమయంలో నాకు తెలియదు. ఇంటికి వచ్చి ఆ రాయిని బాగా కడగిన తరువాత అది రాయి కాదు మరేదో అన్న విషయం అర్థమైంది అని జోనథన్ చెప్పాడు. ఆ వస్తువు ఏంటో తెలుసుకోవాలని జోనథన్ డెన్వర్ మ్యూజియం ఆఫ్ నేచర్ అండ్ సైన్స్‌కు మెయిల్ పెట్టాడు. మ్యూజియం సిబ్బంది ద్వారా అది టీ-రెక్స్ అనే జాతికి చెందిన డైనోసర్ పన్ను అని జోనథన్కు తెలిసింది. ఈ పన్ను ఎక్కడైతే దొరికిందో ఆ ప్రాంతానికి జోనథన్‌తో కలిసి వెళ్తామని, అక్కడ డైనోసర్‌కు చెందిన మరిన్ని శరీర భాగాలు దొరకొచ్చని మ్యూజియం సిబ్బంది తెలిపింది.