వింత బోనాలు..ఎక్కడో తెలుసా
తెలంగాణలో బిర్యానీతో పాటు చాలా ఫేమస్ ఏంటంటే చాలానే ఉన్నాయి. వారి సంప్రదాయాలలో ముఖ్యమైనది ఏంటంటే బోనాలు అనే చెప్పాలి. ఈ బోనాలు పలు విచిత్రంగా జరుగుతున్నాయి ఓ ప్రదేశంలో ..ఆ సంగతులు చూద్దాం. ఐదేళ్లకొసారి..జరిగే గ్రామ దేవతల పూజల కోసం ఆ ఊరు ఊరంతా కలిసి కట్టుగా ఉంటుంది. గ్రామ ప్రజలందరినీ చల్లగా చూడాలని, పాడిపంటలు, గొడ్డుగోదా, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని ఐదేళ్లకోసారి పెద్దఎత్తున పోచమ్మకు కొలుపు చేస్తారు. అయితే పూజలు పూర్తయ్యే వరకు ఊరు ఊరంతా ముఖం కడగరు, చీపురు పట్టి వాకిలి ఊడ్చేది లేదు..కళ్లాపి చల్లేది లేదు…ఇది ఆ ఊరిలో తరతరాలుగా వస్తున్న సంప్రదాయం. వినడానికి వింతగా అనిపించినా ఇది నిజమేనండోయ్…ఇంతకీ ఈ పండగ ఎక్కడో చెప్పనే లేదు కదా..పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ సుగ్లాంపల్లి లో ప్రతి ఐదేళ్లకు ఒకసారి జరిగే గ్రామ దేవత పోచమ్మ, భూలక్ష్మి జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. తమ గ్రామంలో కరోనా సోకకూడదని పెద్దఎత్తున అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఊరు ఊరంతా డప్పు చప్పుళ్లు, బోనాలు, శివసత్తులు పూనకాలతో పోచమ్మ ఆలయం వరకు ఊరేగింపుగా వచ్చి, అమ్మవారికి నైవేద్యం సమర్పించి ప్రజల్ని చల్లాగా చూడాలని ప్రత్యేక పూజలు చేశారు గ్రామస్తులు.