వ్యానే ఇల్లు..ప్ర‌పంచాన్నే చుట్టేస్తోన్న జంట‌..

ఎవ్వ‌రికైనా ప్ర‌పంచాన్ని చుట్టి రావాల‌నిపిస్తుంటుంది..కొత్త కొత్త ప్ర‌దేశాల‌ను చూడాల‌ని వుంటుంది. అయితే బ‌డ్జెట్ మాటేంటి..కొత్త ప్ర‌దేశాల‌కు వెళ్లిన‌ప్పుడు ఎక్క‌డ ఉండాలి ఇలా అనేక ప్ర‌శ్న‌లు తలెత్తుతుంటాయి. అందుకే ఓ జంట వినూత్నంగా ఆలోచించారు. ఎడ్ నైట్‌తో కలిసి విదేశాలకు వెళ్లాలని ప్లాన్ వేసుకుంది లారా ఇవాన్స్. కరోనా రావడంతో… ఈ జంట ప్లాన్ ఫెయిలైంది. దాంతో దేశమంతా వ్యాన్‌లో తిరగాలని మరో ప్లాన్ వేసుకున్నారు. అది సక్సెస్ అవుతోంది.ఇప్పుడు వీరు రోజుకో కొత్త ప్రపంచాన్ని చూస్తున్నారు. ఎక్కడెక్కడికో వెళ్తున్నారు. కొత్త వారిని కలుస్తున్నారు. రకరకాల ఆహారాలు తింటున్నారు. సముద్రాల్లో విహరిస్తున్నారు. చెప్పాలంటే ప్రతి రోజూ పండుగ లాగే ఉంది వీరికి. అది అలాంటి ఇలాంటి ఐడియా కాదండోయ్..వివ‌రాల్లోకి వెళ్తే..ఎడ్ నైట్, లారా ఇవాన్స్… ఈమధ్యే… తమ జీవితాలను సాహసోపేతంగా మార్చుకోవాలి అని అనుకున్నారు.

ఇంగ్లాండ్ అంతా చూసేందుకు ఓ వ్యాన్‌ని ఇల్లుగా మార్చేసుకోవాలి అనుకున్నారు. ఇందుకోసం ఓ పాత గ్యాస్ వ్యానును కొనుక్కున్నారు. దాన్ని రకరకాల మార్పులతో చక్కటి ఇల్లులా మార్చేశారు. ఈ వ్యానును ప్రజలు… చక్రాలపై ఇల్లు అని పిలుస్తున్నారు. నిజానికి ఈ వ్యానును ఇల్లుగా మార్చుకోవడం అంత తేలిగ్గా ఏమీ జరగలేదు. ఈ వ్యానును రూ.7 లక్షలకు కొనుక్కుంది ఈ జంట‌. ఇదో సెకండ్ హ్యాండ్ వ్యాన్. అలాగని బాగా వాడేసింది కాదు. దాని పార్ట్స్, లోపలి భాగాలు అన్నీ బాగానే ఉన్నాయి. దాన్ని ఇల్లుగా మార్చేందుకు ఈ జంటకు 4 నెలల సమయం పట్టింది. ఇలా మార్చేందుకు వారికి మరో రూ.5 లక్షలైంది.లారా ఇవాన్స్… ఓ షాపులో పనిచేసేది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *