రష్మిక బర్త్ డే..ఫస్ట్ లుక్ రిలీజ్
హీరోయిన్ రష్మిక మందన్న రీసెంట్గా బాలీవుడ్‌లోనూ వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. టాలీవుడ్ విషయానికి వస్తే.. ఈ బ్యూటీ డాల్ ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’తో పాటు శర్వానంద్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతోన్న ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమాలో కథానాయికగా నటిస్తోంది. ఈ గ్లామర్ దివా బర్త్ డే సోమవారం(ఏప్రిల్ 5). ఈ సందర్భంగా రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోన్న రెండు నిర్మాణ సంస్థలు ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేస్తూ పోస్టులను పెట్టాయి. ముఖ్యంగా ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమాను రూపొందిస్తోన్న బ్యానర్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్.. సినిమా నుంచి రష్మిక మందన్న ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. పసుపు రంగు చీరలో పువ్వులను కడుతున్నట్లు ఉన్న లుక్‌లో రష్మిక చూపరులను ఇట్టే ఆకట్టుకుంటోంది. మరో వైపు ‘పుష్ప’ టీమ్ కూడా రష్మిక పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేసింది.