అతి పెద్ద నోరుతో గిన్నిస్ బుక్ ఎక్కిన మహిళ..ఎక్కడో తెలుసా..

టిక్ టాక్ ద్వారా ఫేమ్ పొందిన ఓ మహిళ ఏకంగా గిన్నిస్ రికార్డును సాధించింది. కానీ ఈ బ్యూటీ టిక్ టాక్ తో గిన్నిస్ రికార్డును పొందలేదు. తన నోటితో గిన్నిస్ రికార్డును సొంతం చేసుకుంది. అమెరికా దేశానికి చెందిన 31ఏళ్ల సమంతా రామ్స్డెల్ అనే మహిళ తనకు ఉన్న అతి పెద్ద నోరు కారణంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించింది. సమంతా నోరు అందరూ ఆశ్చర్యపోయేలా దాదాపు 6.52 సెంటీమీటర్లు ఉంటుందట. అంతే కాకుండా సమంతా దవడ కూడా ఎటంటే అటు సాగిపోవడం చూసిన గిన్నిస్ బుక్ ప్రతినిధులు వచ్చి కొలతలు తీసుకుని మరీ ఆమెకు వరల్డ్ రికార్డ్స్ లో అతి పెద్ద నోరు కలిగిన మహిళగా చోటు కల్పించారు.ఇప్పుడే కాదు చిన్నతనం నుంచే సమంతా నోరు పెద్దగా ఉండేదట. ప్రస్తుతం ఆమె చిన్న వయసులో ఉండగా దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇలా నోరు పెద్దగా ఉండడం ఆమెకు వంశపారంపర్యంగా వచ్చిందా అంటే వాళ్ల కుటుంబంలో ఎవరికీ ఆమెలా నోరు పెద్దదిగా లేదట. ఆమె నోటిలో ఓ పెద్ద యాపిల్ పండు పట్టేంతలా తెరుస్తుంది. ఇప్పటి వరకు గిన్నీస్ బుక్ లో ఎన్నో వింతలు విడ్డూరాలు నమోదు అయ్యాయి. కాని ఇది అత్యంత విచిత్రమైన వింతగా.. ఇది ఖచ్చితంగా ఒక ప్రపంచ వింతగా గిన్నీస్ బుక్ వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రపంచంలో అత్యంత విభిన్నంగా ఉన్న వారు చాలా మంది ఉంటారు. వారిలో ఈమె ఒకరు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *