అతి పెద్ద పబ్లిక్ టాయిలెట్..ఎక్కడో తెలుసా..
సాధారణంగా మనం పబ్లిక్ టాయిలెట్స్ చూస్తూవుంటాం..అవి ఓ రూం అంత చిన్నగా వుంటాయి..కానీ ఏకంగా రెండు అంతస్తులలో పబ్లిక్ టాయిలెట్స్ అంటే మాటలా చెప్పండి..ఎక్కడా అనుకుంటున్నారా.. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో అతిపెద్ద పబ్లిక్ టాయిలెట్‌ను ప్రారంభించారు. రెండు ఫ్లోర్లలో మొత్తం 88 టాయిలెట్ బ్లాక్స్‌తో ఉన్న భారీ పబ్లిక్ టాయిలెట్‌ను అంధేరి వెస్ట్‌లోని జుహూ గల్లి వద్ద ఏర్పాటు చేశారు. ఈ పబ్లిక్ టాయిలెట్ గ్రౌండ్ ఫ్లోర్లో 60 సీట్లు, మొదటి అంతస్తులో 28 సీట్లు ఉన్నాయని బృహన్ ముంబై నగర పాలక సంస్థ అధికారులు తెలిపారు. ఈ పబ్లిక్ టాయిలెట్లో రౌండ్ ది క్లాక్ క్లీనింగ్ సిస్టమ్ ఉందని, వార్తాపత్రికలతోపాటు వెయిటింగ్ ఏరియా, ఉచిత వై-ఫై, టీవీ సౌకర్యం ఉన్నాయని వారు చెప్పారు.2018లో కూడా ముంబైలోని గిల్బర్ట్ హిల్ ప్రాంతంలో 55 టాయిలెట్ బ్లాక్స్‌తో అతిపెద్ద పబ్లిక్ టాయిలెట్‌ను నిర్మించామని, ఇప్పుడు అంతకంటే పెద్దగా రెండు ఫ్లోర్లలో 88 టాయిలెట్ బ్లాక్స్ కలిగిన టాయిలెట్‌ను నిర్మించామని బీఎంసీ అధికారులు చెప్పారు. ఇందులో గ్రౌండ్ ఫ్లోర్‌లోని 60 టాయిలెట్ బ్లాక్స్‌ను మహిళల కోసం, ఫస్ట్ ఫ్లోర్‌లోని 28 టాయిలెట్ బ్లాక్స్‌ను పురుషుల కోసం కేటాయించారని తెలిపారు. ఈ టాయిలెట్ నిర్మాణం కోసం మొత్తం రూ.1.5కోట్లు ఖర్చయిందని వెల్లడించారు.అయితే, ఈ టాయిలెట్లను వినియోగించే వారి నుంచి ప్రత్యేకంగా చార్జీలు ఏవీ వసూలు చేయరని, అయితే స్థానిక బస్తీల ప్రజలు నెలకు ఇంటికి రూ.60 చొప్పున నామమాత్రపు రుసుము చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.