అత్యంత ప్రమాదకరంగా డెల్టా వేరియంట్

కరోనాలో డెల్టా వేరియంట్ ఎంత ప్రమాదకారి అన్న విషయం తాజాగా మరోసారి బయటకు వచ్చింది. కొవిడ్ 19 వ్యాప్తి మొదలైన తర్వాత.. మార్పులకు గురి కావటం తెలిసిందే. ఇలా మార్పులకు గురైన వేరియంట్లలో అత్యంత ప్రమాదకరమైనది డెల్టా వేరియంట్ అన్న మాట బలంగా వినిపిస్తోంది. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రెయాసస్ వార్నింగ్ ఇచ్చేశారు.ఇప్పటి వరకు వచ్చిన వేరియంట్లలో అత్యంత ప్రమాదకరమైనది డెల్టా వేరియంట్ అని ఆయన చెబుతున్నారు. ప్రస్తుతానికి ఈ వేరియంట్ దాదాపు 85 దేశాలకు విస్తరించినట్లుగా చెబుతున్నారు. ఈ వేరియంట్ మీద తాముచాలా ఆందోళనతో ఉన్నట్లుగా చెబుతున్నారు. కొన్ని దేశాల్లోకరోనా సడలింపు కారణంగా వేరియంట్ వ్యాప్తి మరింత పెరిగే ప్రమాదం ఉందంటున్నారు.టీకా తీసుకోని వారి కారణంగా డెల్టా వేరియంట్ అంతకంతకూ విస్తురిస్తుందని.. దీని కారణంగా మరిన్ని కొత్త వేరియంట్లు పుట్టేందుకు అవకాశం ఉందని చెబుతున్నారు. కొత్త వేరియంట్లు తెర మీదకు రాకుండా ఉండాలంటే.. వైరస్ వ్యాప్తి ఆగితేనే సాధ్యమని చెప్పకతప్పదు. రానున్న రోజుల్లో డెల్టా వేరియంట్ మరిన్ని దేశాలకు వ్యాప్తి చెందే వీలుందని చెబుతున్నారు. కొవిడ్ వెలుగు చూసిన తర్వాత ఇప్పటికే పలు రూపాల్లోకి సదరు వైరస్ మారింది.ఇప్పటివరకు వెలుగు చూసిన వేరియంట్లలో అత్యంత ప్రమాదకరమైనది డెల్టా కాగా.. దానికి ముందున్న వేరియంట్లు ఎన్నేసి దేశాలకు వ్యాప్తి చెందాయన్నది చూస్తే.. అల్ఫా 170 దేశాల్లో.. బీటా 119 దేశాల్లో.. గామా 71 దేశాల్లో వ్యాప్తి చెందింది. డెల్టాకు మించి డెల్టా ప్లస్ వేరియంట్ కూడా అంతే ప్రమాదకరంగా వ్యాప్తి చెందినట్లుగా తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *