అధికారి భర్యనూ చంపేశావ్ కదా “ఈనాడు”
తెలుగుకు బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకునే ఈనాడు అప్పుడప్పుడు ఖూనీ కూడా చేస్తుంది. భాష ప్రయోగాల్లో గాని పద ప్రయోగంలో గాని పదప్రయోగంలోగాని వికారమైన వికృతమైన పదాలను అచ్చ తెలుగు అని చెప్పి రుద్దుతుంది. కొన్నిసార్లు ఈనాడు చేసే చిన్న చిన్న పొరపాట్లు వికృత అర్థాన్ని ఇస్తాయి. ఆ జాబితాలోనే ఈరోజు ఒక ఆణిముత్యం రాలింది.
ఒక వైద్యాధికారి ఇటీవల కరోనాతో మరణించారు. ఆయన భార్యకు ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చింది. ఇది వార్త. దానికి ఈనాడులో వచ్చిన హెడ్డింగ్.. “కరోనాతో మరణించిన వైద్యాధికారి భార్యకు గ్రూప్ -1 ఉద్యోగం”.. ఈ హెడ్డింగ్ ప్రకారం ఎవరు చనిపోయినట్టు? వైద్యాధికారి భార్య మరణించింది అని వచ్చేలా ధ్వనిస్తోంది. మరి వైద్యాధికారి భార్య మరణిస్తే ఉద్యోగం ఎవరికిచ్చారు? రాసిన హెడ్డింగును ఒక్కసారి చదువుకున్నా ఇది ఈజీగా అర్థమవుతుంది. వార్త రాసిన స్టాఫ్ రిపోర్టర్ గానీ.. దిద్దిన సబ్ఎడిటర్ గానీ ఆ పని చేయలేదు. దీంతో పాఠకుల మెదడుకు ఓ పజిల్ ఇచ్చినట్లయింది.