అధిక పార్కింగ్ ఫీజులపై స్పందించిన ‘KTR’
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అధికంగా పార్కింగ్ ఫీజులు అసలు చేయడంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఒక కారును 31 నిమిషాలు పార్కింగ్ చేసినందుకు 500 రూపాయలు వసూలు చేసిన వైనం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. “the4thestate.in” వెబ్సైట్ లోనూ ప్రత్యేక కథనం ప్రచురితం అయింది.
ఇదే అంశంపై ట్విట్టర్ లో కేటీఆర్ ను ట్యాగ్ చేస్తూ మాజీ ఆర్మీ అధికారి పోస్ట్ చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో కారు పార్కింగ్ చేస్తే జేబు గుల్ల చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెంటనే చర్యలు తీసుకోవాలని ట్విట్టర్ లో కోరారు. 500 వసూలు చేయడం సరైనది కాదని.. వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.