అన్ని డెల్టా వేరియంట్లు ఆందోళనకర వేరియంట్లే..
మూడో దశ కరోనా విజృంభణలో డెల్టా ప్లస్ వేరియంట్ ముప్పు ఉంటుందని చెప్పేందుకు ఆధారాలు లేవని చెప్పారు డైరెక్టరేట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనొమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయోలజీ సంచాలకుడు అనురాగ్ అగర్వాల్ కొట్టిపారేశారు.. ఏప్రిల్, మేలో మహారాష్ట్రలో సేకరించిన నమూనాలను తమ సంస్థ ఈ నెలలో విశ్లేషించిందని, ఆ రాష్ట్రంలో డెల్టా ప్లస్ వేరియంట్లు ఉన్నప్పటికీ మొత్తం కేసుల్లో కేవలం ఒక్క శాతం కన్నా తక్కువ కేసుల్లోనే ఈ వేరియంట్ ఉన్నట్లు గుర్తించిందని చెప్పారు.కరోనా కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనూ డెల్టా కేసులు ఎక్కువగా లేవని వివరించారు. అయితే, అన్ని డెల్టా వేరియంట్లు ఆందోళనకర వేరియంట్లేనని చెప్పారు. ప్రస్తుతం దేశంలో వెలుగులోకి వచ్చిన డెల్టా వేరియంట్ల గురించి ఆందోళన చెందకూడదని చెప్పారు.మూడో దశ గురించి ఆందోళన చెందే ముందు దేశంలో రెండో దశ కరోనా విజృంభణ ఇంకా కట్టడి కాలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. డెల్టా వేరియంట్ కన్నా డెల్టా ప్లస్ వేరియంట్ విజృంభణ మూడోదశలో తీవ్ర స్థాయిలో ఉంటుందన్న ఆందోళన అవసరం లేదని, దీనిపై ఎటువంటి ఆధారాలూ లేవని చెప్పారు.దేశంలో ఇప్పటివరకు 40కి పైగా డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే దీన్ని నిపుణులు ఆందోళనకర వేరియంట్ గా గుర్తించారు. దీనిపై దృష్టి పెట్టాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మహారాష్ట్ర, కేరళ, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు సూచించింది. దీని కట్టడికి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పింది.