అమెజాన్ అడవిలో విమానం..తర్వాత ఏం జరిగిందంటే..
అమెజాన్ అడవి గురించి తెలుసుగా అతి పెద్ద అడవి..మరి అలాంటి అడవిలో చిక్కుకుపోతే ఏమవుతేంది..పై ప్రాణాలు పైనే పోతాయి..కానీ ఎంతో థైర్యంతో ఆ అడవి నుండి బయటపడ్డాడు ఓ వ్యక్తి..ఆ వివరాలు.. ఆంటోనియో ఒక పైలట్. ఆయన నడుపుతున్న విమానం అడవిలో క్రాష్‌ల్యాండ్ అయింది.కొన్ని నెలల క్రితం మారుమూల ప్రాంతంలో ఉన్న గనుల దగ్గరకు ఒంటరిగా విమానంలో సరుకులు తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.చెట్ల కొమ్మల మధ్యలోంచి ఆయన ఆ విమానాన్ని సురక్షితంగా దించగలిగారు.విమానం కూలే ముందు “మే డే, మే డే, పాపా, టాంగో, ఇండియా, రోమియో, జూలియట్ కూలిపోతున్నాడు” అనే రేడియో సందేశాన్ని ఆంటోనియో చివరగా పంపించారు.గనుల ప్రాంతానికి దాదాపు కిలోమీటర్ దూరంలో విమానం ఇంజన్ పని చేయడం ఆగిపోయింది. దాంతో విమానాన్ని అడవి మధ్యలో ల్యాండ్ చేయవలసి వచ్చింది” అని ఆయన చెప్పారు.ఆ అడవిలో బతకడానికి ఆహారం కోసం, నీళ్ల కోసం, తల దాచుకోవడానికి సురక్షితమైన ప్రాంతం కోసం ఆయన చాలా కష్టపడాల్సి వచ్చింది.తనను ఎవరైనా రక్షిస్తారేమోనని ఆంటోనియో కొన్ని రోజులు ఎదురుచూశారు. కానీ ప్రతిరోజూ ఆయనకు భయానక అనుభవమే మిగిలింది.అలాంటి దట్టమైన అడవుల్లో ఆహారం వెతుక్కుంటూ, ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని, నెల రోజులకుపైగా తనను తాను కాపాడుకోవలసిన పరిస్థితి వస్తుందని ఆంటోనియో ఎప్పుడూ ఊహించలేదు.విమానం పడిపోయిన ప్రాంతం అమెజాన్ నదికి ఉత్తర దిక్కుగా ఉంది. ఈ ప్రమాదంలో ఆయన మరణాన్నైతే తప్పించుకున్నారు. కానీ అసలు సమస్యలు అప్పుడే మొదలయ్యాయి. విమానంలో ఉన్న ఇంధనమంతా లీక్ అయిపోయింది.నేనున్న ప్రమాదకర స్థితిలో ఆ విమానాన్ని అక్కడ వదిలేయడం తప్ప వేరే మార్గం లేదు” అని అన్నారు ఆంటోనియా.ఆ విమానం లోపల తల దాచుకోవడానికి వీలులేకపోయింది. దాంతో అక్కడకు దగ్గరలోనే చెట్లపై ఉండిపోయారు. రేడియోలో తాను పంపిన ఆఖరి సందేశం విని ఎవరైనా సహాయం చేసేందుకు వస్తారని అనుకున్నారు.ఆ అడవిలో నేను 5 నుంచి 8 రోజులు ఉండాల్సి వస్తుందేమో అనుకున్నాను. సాధారణంగా ఎవరినైనా వెతికి పట్టుకోవడానికి రక్షణ బృందాలకు పట్టే సమయం అది. కానీ రోజులు గడుస్తున్నా ఎవరూ రాలేదు” అని వివరించారు ఆంటోనియో.ఆప్తులను తిరిగి కలుసుకోవాలంటే ముందు ఆ విమానం కూలిన ప్రాంతం నుంచి కదలడం మొదలుపెట్టాలని ఆంటోనియో నిర్ణయించుకున్నారు.అడవి నుంచి బయటపడే మార్గం వెతుక్కుంటూ ఆయన నడవడం మొదలుపెట్టారు.రెస్క్యూ బృందాలు నన్ను కనిపెట్టలేకపోయాయని అర్థమైంది. ఇక ఆ ప్రాంతాన్ని ఎలాగైనా దాటి నా కుటుంబాన్ని చూడాలని అనుకున్నాను” అని ఆయన చెప్పారు.సూర్యుడు ఉదయించగానే, వెలుగు కిరణాలు వచ్చే వైపు చూసుకుంటూ నడవడం మొదలుపెట్టి, జనావాసాలు ఉన్న ప్రాంతానికి చేరాలని తీవ్రంగా ప్రయత్నించారు ఆంటోనియో. ప్రతి రోజూ తూర్పు దిక్కుగా రెండు నుంచి నాలుగు గంటల పాటు నడిచారు.అలా నడుస్తూ వెళ్లిన తర్వాత రాత్రికి ఎక్కడ ఉండాలో, ఎక్కడ తల దాచుకుని, మంట కాచుకోవాలో ఆలోచించాల్సి వచ్చేది” అని ఆయన చెప్పారు.రవాణా, కమ్యూనికేషన్ లేని అమెజాన్ అడవుల్లో ఇలా ఒంటరిగా ఉండటం చాలా కష్టమైన విషయమే. కానీ అడవుల్లో తనను తాను కాపాడుకునేందుకు ఆంటోనియో కొన్ని మెళకువలు నేర్చుకున్నారు.వైమానిక దళ శిక్షణ సమయంలో అడవుల్లో స్వీయ రక్షణకు అవసరమైన ట్రైనింగ్ తీసుకున్నాను. నేను అమెజాన్ ప్రాంతంలోనే పుట్టాను. కొంత కాలం అక్కడున్న అనుభవం నాకు నాకుందని చెప్పుకొచ్చారాయన.అడవుల్లో మారుమూల ప్రాంతంలో నివసించే ప్రజల దగ్గర నుంచి గతంలో ఆయన కొంత సమాచారం తెలుసుకున్నారు. అదే ఇప్పుడు ఆయనకు పనికొచ్చింది.ఆ అడవుల్లోకి వెళ్లినప్పుడల్లా అక్కడి ప్రజలతో మాట్లాడేవాడిని. వాళ్ల దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకోవచ్చు” అని ఆంటోనియో చెప్పారు. ఆంటోనియో అడవిలో ఉండేందుకు పాటిస్తున్న మెలకువలు పని చేస్తున్నప్పటికీ, ఆయన చాలా బరువు తగ్గిపోయారు. ఆయన విమానం కూలిన చోటును వదిలిపెట్టి, కొన్ని వారాలు గడిచాయి.36 రోజుల తర్వాత ఆయనకు కొంతమంది మనుషులు కనిపించారు.అడవిలో నడుస్తూ, కొండలు ఎక్కుతూ, నదీ ప్రాంతాలను దాటుతూ, ఒక నిర్జన ప్రదేశంలో బ్రెజిల్ నట్స్‌ను సేకరించే వ్యక్తులను కలిసాను” అని ఆయన చెప్పారు.ముందు వాళ్లు కనపడలేదు. కానీ వాళ్లు చేస్తున్న శబ్దాలను వింటూ నడుచకుంటూ వెళ్లిన ఆంటోనియో మొత్తానికి వాళ్లను కలిశారు.దీంతో ఆయన ఇన్ని రోజులు పడిన కష్టాలు ఒక కొలిక్కి వచ్చాయి.ఒకవైపు ఆకలి, నొప్పులు బాధపెడుతున్నా తన కుటుంబాన్ని తిరిగి చూడాలనే ఆశే తనను ముందుకు నడిపించింది” అని ఆయన చెప్పారు.అడవి నుంచి బయటకు వచ్చి, ఎయిర్ పోర్టులో నా కుటుంబాన్ని కలుసుకోవడం నా జీవితంలో మర్చిపోలేని క్షణం” అని అన్నారు ఆంటోనియో.ఆయనను వెతికేందుకు అనేక విమానాలు, హెలికాఫ్టర్లను పంపించినప్పటికీ, అవి కొన్ని వారాల ముందే వెతకడాన్ని ఆపేశాయి.ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి ఆంటోనియో నడుచుకుంటూ రాకపోయి ఉండుంటే, ఆయన తన కుటుంబాన్ని ఎప్పటికీ కలుసుకునే వారు కాదు.నేనిదంతా వాళ్ల కోసమే చేశాను. వాళ్లనే తలచుకుంటూ ముందుకు కదిలాను” అన్నారు ఆంటోనియో.