అరేబియా సముద్రంలో మిస్టరీ ద్వీపం..

సముద్రాలలో ఎంతో విలువైన వజ్రాలు..బంగారం లాంటి సంపదలతో పాటు ద్వారకా లాంటి అద్భుతమైన పట్టణాలు కూడా నీట మునిగాయి. అంతేనా ఎంతో విలువైన టైటానిక్ షిఫ్ కూడా సముద్ర గర్భంలోనే ఉంది. ఇకపోతే సముద్ర గర్భాల్లో పురాతన నగరాలు పట్టణాలకు చెందిన శిథిలాలు బయట పడుతుంటాయి. ఒకప్పుడు భూమిపై ఉన్న అలాంటి ఎన్నో ప్రాంతాలు నేడు సముద్ర గర్భంలో కుంగిపోయాయి. అయితే తాజాగా అరేబియా సముద్రంలో ఓ మిస్టరీ ద్వీపాన్ని గుర్తించారు. అది సముద్ర గర్భంలో ఉన్నట్లు గూగుల్ మ్యాప్ లో కనిపిస్తోంది. అరేబియా సముద్రంలో ఓ కొత్త ద్వీపాన్ని గూగుల్ మ్యాప్ గుర్తించింది. కేరళ రాష్ట్రంలోని కొచ్చికి అతి సమీపంలో ఆ ద్వీపం ఉంది. గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి దూరంగా చూస్తే నీటి అడుగున ద్వీపాన్ని స్పష్టంగా చూడవచ్చు. కానీ దాన్ని జూమ్ చేసి చూస్తే అక్కడ కూడా నీళ్లే ఉన్నాయి. బీన్ ఆకారంలో ఉన్న దీనిపై ప్రస్తుతం నిపుణుల పరిశోధనలు జరుగుతున్నాయి. ఈనెల ప్రారంభంలో ఈ ద్వీపాన్ని గుర్తించారు. కర్షిక టూరిజం డెవలప్ మెంట్ సొసైటీ అధ్యక్షుడు జులప్పన్ గూగుల్ మ్యాప్స్ లో ఈ దీవిని గుర్తించారు.ఈ విషయాన్ని వెంటనే కేరళ యూనివర్సిటీ ఆఫ్ ఫిషరీస్ అండ్ ఓషియన్ స్టడీస్ కు తెలియజేశారు. కొచ్చి తీరానికి పశ్చిమాన ఏడు కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది. కనిపిస్తున్న ఫోటోల ప్రకారం ఈ దీవి పొడవు 8 కిలోమీటర్లు వెడల్పు 3.5 కిలోమీటర్లు ఉండొచ్చని అంచనా వేశారు. అసలు ఇది ఎలా ఏర్పడిందో అర్థం కావడం లేదు. ఒకప్పుడు అక్కడ ఏదైనా కట్టడం ఉందా లాంటి అనేక అనుమానాలతో రాబోయే రోజుల్లో నిపుణులతో సమావేశాలు జరిపి దానిపై కొంచెం లోతైన అధ్యయనం చేయనున్నారు. ఈ క్రమంలోనే దాని గురించి పూర్తి వివరాలు తెలియనున్నాయి. అయితే సముద్ర గర్భంలో పలు మార్పులు ఏర్పడడం వల్ల అందులో ఉండేవి పై నుంచి చూస్తే అలా కనిపించే అవకాశం ఉందని అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *