ఆరు అడుగుల పాము.. లుంగీలో వేసుకొని..
సాధారణంగా ఎవరైనా పామును చూస్తే చాలు కేకలు వేస్తూ ఎగిరి గంతేస్తారు. కంటపడితే అక్కడి నుంచి పరుగులు పెడుతుంటారు. కానీ ఓ వ్యక్తి మాత్రం పామును చూసి కొంచం కూడా భయపడకుండా పట్టుకున్నాడు. ఆరడుగుల పామును అవలీలగా చేతులతో పట్టుకొని ఆడించాడు. పాము కాటేసేందుకు ప్రయత్నించినా చాకచక్యంగా తప్పించుకొని దానితో ఓ ఆట ఆడుకున్నాడు. చివరికి పామును తను కట్టుకున్న లుంగీలో వేసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే ఇది ఇప్పుడు జరిగింది కాదు. ఈ వీడియో గతంలో ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత్ నంద తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. అది ప్రస్తుతం మరోసారి వైరల్ గా మారింది. తాజాగా ఓ ట్విటర్ యూజర్ మళ్లీ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం ఈ వీడియో హల్చల్ చేస్తుంది. దీనిని చూసిన నెటిజన్లు షాకుకు గురవుతున్నారు. నువ్వు దేవుడు స్వామి అంటూ రీట్వీట్ చేస్తున్నారు. సదరు వ్యక్తి ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. కానీ ఇటువంటివి చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. అన్ని రోజులు మనవి కాదు.. పాములకు కూడా ఏదో ఒకరోజు వస్తుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
#ViralVideo: खतरनाक सांप को पकड़कर डाल दिया लूंगी के अंदर#Snake #SnakeViralVideo pic.twitter.com/cOV21NCAnU
— India.com (हिन्दी) (@IndiacomNews) May 18, 2021