ఆ ఊరిలో అంతా మ‌రుగుజ్జులే..కార‌ణం తెలుసా..

పొట్టిగా ఉండ‌టం వేరు..ఆ పొట్టి కంటే త‌క్కువ‌గా ఉంటే వారిని మ‌రుగుజ్జులు అంటారు. అలాంటి వారిని చూస్తే విచిత్రంగా అనిపిస్తుంటుంది. అయితే ఒక ఊరిలో ఒక‌రో..ఇద్ద‌రో మ‌రుగుజ్జులు క‌నిపించ‌డం స‌హ‌జ‌మే. కానీ ఆ ఊళ్లో మాత్రం స‌గం మంది మ‌రుగుజ్జులే. మ‌రి ఆ ఊరు ఎక్క‌డుందంటే.. చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో ఉంది. ఆ ఊరు పేరు యాంగ్సి. ఆ ఊరిలో ఉన్న వాళ్ల‌లో స‌గం మంది మ‌రుగుజ్జులే. అస‌లు.. ఆ ఊరిలో అంత‌మంది ఎలా మ‌రుగుజ్జులు అయ్యారో ఎవ్వ‌రికీ అంతుప‌ట్ట‌డం లేదు. ఆ ఊళ్లో ఉన్న‌ మ‌రుగుజ్జుల్లో ఎక్కువ హైటే 3 ఫీట్లా 10 ఇంచులు. త‌క్కువ హైట్ 2 ఫీట్లా ఒక ఇంచ్‌.ఒక‌వేళ ఆ ఊరి ప్ర‌జ‌లు తినే ఆహారం, ఆ ఊరు నీళ్లు, ప్రాంతం, నేల స్వ‌భావం.. ఇలా వీటిలో దేనివ‌ల్ల అయినా వాళ్లు మ‌రుగుజ్జులు అయ్యారేమో అని సైంటిస్టులు ఎన్నో టెస్టులు చేసిన‌ప్ప‌టికీ అస‌లు ర‌హ‌స్యం మాత్రం క‌నుక్కోలేక‌పోయారు.అయితే.. ఆ ఊరికి చెందిన ఓ పెద్ద‌మ‌నిషి ఏమంటాడంటే.. వేసవికాలంలో ఓ రోజు అర్ధ‌రాత్రి స‌మ‌యంలో ఒక మాయ‌దారి రోగం ఊరిలోని చిన్న పిల్ల‌ల‌కు సోకింది. అది కూడా 5 నుంచి 7 సంవ‌త్స‌రాలు ఉన్న పిల్ల‌ల‌కే సోకింది. అప్ప‌టి నుంచి ఆ పిల్ల‌ల్లో ఎదుగుద‌ల ఆగిపోయింది. వాళ్ల‌లో కొంద‌రికి కాళ్లు చేతులు ప‌డిపోయాయి. విక‌లాంగులుగా మారిపోయారు.. అని చెప్పుకొచ్చాడు.

అయితే.. 1997లో మ‌రో విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. ఆ ఊరిలోని నేల‌లో మెర్క్యూరీ సాంద్ర‌త పెర‌గ‌డం వ‌ల్ల అక్క‌డి ప్ర‌జ‌ల్లో పెరుగుద‌ల ఆగిపోయింది అనే విష‌యం కూడా ప్ర‌చారంలోకి వ‌చ్చింది. లేదు లేదు.. జ‌పాన్‌.. చైనాలో విష‌పు గ్యాస్‌ను వ‌దిలిన‌ప్పుడు.. ఆ విష‌పు గ్యాస్‌.. ఈ ఊరిలోకి వ్యాపించింది. అందుకే.. ఇక్క‌డి ప్ర‌జ‌లు ఎత్తు పెర‌గ‌లేదు అంటూ మ‌రో వాద‌న కూడా తెర‌మీదికి వ‌చ్చింది. ఇలా ఆ ఊరి మ‌రుగుజ్జుల మీద ప‌లు ర‌కాల వాద‌న‌లు తెర మీదికి వ‌స్తున్న‌ప్ప‌ట‌కి… అస‌లు ర‌హ‌స్యాన్ని మాత్రం ఎవ్వ‌రూ క‌నుక్కోలేక‌పోయారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *