ఆ పార్ట్ తొలగిస్తేనే ఆ ఊరిలో ఉండనిస్తారట..అదేంటో తెలుసా..

ఒక్కో ఊరిది ఒక్కో కట్టుబాటు..మరి ఆ కట్టుబాట్లకి అనుగుణంగానే అక్కడి ప్రజల జీవన విధానం ఆధారపడి ఉంటుంది. అయితే ఇక్కడ నివసించాలి అంటే ఆ కట్టుబాట్లని తప్పనిసరిగా పాటించాలట. ఆ వివరాలు తెలుసుకుందాం.. ప్రపంచంలో ఎప్పుడు ఎక్కడైనా నివసించవచ్చు. కానీ, మనం అక్కడి నిబంధనలకు, అలవాట్లు, ఆచారాలకు కట్టుబడి ఉండాలి. అయితే, అన్ని ప్రాంతాల్లో అవి తప్పనిసరి కాకపోవచ్చు. కానీ.. అంటార్కిటిక్‌లోని విల్లా లాస్ ఎస్ట్రెల్లాస్ అనే పట్టణంలో నివసించాలంటే మాత్రం.. ముందుగా మీరు శరీరంలోని ఓ పార్టును తొలగించుకోవాలి. ఆ సర్జరీకి సంబంధించిన సర్టిఫికెట్‌ను వారికి చూపించాలి.వామ్మో.. ఇంతకీ ఏమిటీ ఆ పార్ట్? అక్కడ ఎందుకు ఆ రూల్ పెట్టారనేగా మీ సందేహం? విల్లా లాస్ ఎస్ట్రెల్లాస్ పట్టణం మొత్తం 14,970 చదరపు అడుగులు విస్తరించి ఉంది. ఇక్కడ కేవలం 150 మంది మాత్రమే నివసిస్తున్నారు. ప్రపంచం నుంచి వెలసినట్లు ఉండే ఈ పట్టణం ఎప్పుడూ నిశబ్దంగానే ఉంటుంది. పైగా ఈ ప్రాంతానికి వచ్చే సందర్శకులు కూడా తక్కువే.ఈ ప్రశాంతమైన ప్రాంతంలో నివసించాలని భావిస్తే.. తప్పకుండా మీ శరీరంలోని ఆంత్రం లేదా అపెండిక్స్ (appendix) తొలగించుకోవాలి. దీన్నే మనం 24 గంటల నొప్పి అని కూడా పిలుస్తాం. విల్లా లాస్ ఎస్ట్రెల్లాస్ నివసించడానికి.. అపెండిక్స్ సర్జరీకి సంబంధం ఏమిటనే మరో సందేహం కూడా మీకు రావచ్చు. ఇందుకు డాక్టర్ కరణ్ రాజ్ అనే నేషనల్ హెల్త్ సర్వీస్ వైద్యుడు ఏం చెప్పారో చూడండి.కోవిడ్-19తో పాటు వివిధ రకాల ఔషదాలు, వైద్య చిట్కాలను టిక్‌టాక్ ద్వారా వెల్లడించే కరణ్ రాజ్.. ఈ సారి విల్లా లాస్ ఎస్ట్రెల్లాస్ పట్టణంలోని వింత నిబంధన గురించి తెలిపారు. ఆ పట్టణంలో నివసించే పెద్దలు నుంచి పిల్లలు వరకు ప్రతి ఒక్కరూ తప్పకుండా అపెండిక్స్ తొలగించుకోవాలని చెప్పడంతో ఆయన ఫాలోవర్లు ఆశ్చర్యపోయారు. వాస్తవానికి ఆ పట్టణంలో వైద్య సదుపాయాలు చాలా తక్కువ అని, ఆ ప్రాంతానికి సుమారు వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఒకే ఒక హాస్పిటల్ ఉందని కరణ్ తెలిపారు. ఎవరికైనా అపెండిసైటిస్ సమస్య వస్తే అక్కడి నుంచి హాస్పిటల్‌కు తరలించేసరికి చనిపోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం విల్లా లాస్ ఎస్ట్రెల్లాస్‌లో రెండు పడకల హాస్పిటల్, డెంటల్ క్లినిక్ మాత్రమే ఉన్నాయి. 2018 నుంచి ప్రజలు అపెండిక్స్ తొలగించాలనే నిబంధన అమల్లోకి వచ్చింది. ఈ పట్టణంలో టెక్నాలజీ కూడా అంతంత మాత్రమే. అక్కడ కంప్యూటర్లు వాడేవారు చాలా తక్కువ. ఇంటర్నెట్ కూడా అంతంత మాత్రమే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *