ఆ ఫోర్ట్ లో అమ్మాయి ఆత్మ ..వాయిస్ ని రికార్డ్ కూడా చేశార‌ట‌..ఎక్క‌డో తెలుసా..!

ఈ ప్ర‌పంచాన్ని ఓ అద్భుత‌శ‌క్తి న‌డిపిస్తుంద‌ని తెలుసు అదే దేవుడు అంటారు అంతా..మ‌రి దేవుడు వున్న‌ప్పుడు..దెయ్యం ఉండి తీరాలిగా..అయితే దెయ్యం అనేది ఈ ప్రపంచంలో ఉందా.. లేదా అనేది ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. కానీ ప్రజలు దీని గురించి రకరకాల కథలు వింటూనే ఉన్నారు..ప‌లు సినిమాల్లో చూస్తున్నారు కూడా. అయితే దెయ్యాలు ఉన్నాయని నమ్మే కొన్ని ప్రదేశాలు కూడా ఉన్నాయంటే న‌మ్మ‌శ‌క్యం కానీ సంగ‌తి..కానీ అలాంటి ప్రదేశాలలో బ్రిటన్‌లోని వేల్స్‌లోని కన్వీ ఫోర్ట్ ఒకటి. ఇక్కడికి వచ్చిన కొంతమంది సందర్శకులు ఇక్కడ ఒక అమ్మాయి ఆత్మ ఉందని చెప్పారు. నార్త్ వేల్స్‌లో ఉన్న ఈ కోటను యునెస్కో వారసత్వంగా గుర్తించారు. ఇక్కడకు వచ్చిన చాలా మంది ఒక సన్యాసి ఆత్మ ఇక్కడ తిరుగుతుందని కొవ్వొత్తి వెలుగులో ఒక పెద్ద మనిషి నీడ కనిపిస్తుందని చెబుతారు. అయితే ఇప్పుడు ఇక్కడ మరో దెయ్యం ఉందని కనుగొన్నారు. 2016 లో ఇక్కడకు వచ్చిన ఒక పరిశోధకుడు తాను ఇక్కడ ఒక అమ్మాయి గొంతు విన్నానని చెప్పాడు ఈ వ్యక్తి ఆ దెయ్యం స్వరాన్ని కూడా రికార్డ్ చేశాడు. ఈ హాంటెడ్ ఫోర్ట్ మెట్ల నుంచి కోట పైభాగానికి వెళ్లి అక్కడ చాలా అందమైన దృశ్యాన్ని చూడటానికి ప్రజలు ఇష్టపడతారు. అందుకే చాలామంది సందర్శకులు ఇక్కడికి వస్తారు. ఈ కోట 13 వ శతాబ్దంలో సిస్టేరియన్ ఆశ్రమంలో నిర్మించారని చెబుతారు. ఆ కాలంలో కొన్ని ఆత్మలు ఈ కోటలో ఖైదు చేశారని నమ్ముతారు. స్థానికులు ఈ ఆత్మలను చూసినట్లు వాటి గొంతు విన్నట్లు చెబుతారు. ఒక సమాచారం ప్రకారం ఈ కోటను రాజు హెన్రీ 8 16 వ శతాబ్దంలో జైలుగా ఉపయోగించారు. ఆ జైలులో మరణించిన వారి ఆత్మలు ఇదే కోటలో తిరుగుతున్నాయని అంటారు. 2020 సంవత్సరంలో ఈ కోట వెలుపల సైనికులు దెయ్యాల వరుసను కూడా చూశామని పేర్కొన్నారు. ఒక వ్యక్తి దాని ఫొటో కూడా తీశారనే వాదన కూడా ఉంది. మ‌రి ఇది ఎంత‌వ‌ర‌కు నిజ‌మో తెలియ‌దు గాని ఈ వార్త ఇప్పుడు బాగా వైర‌ల్ అవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *