ఆ వ్య‌క్తికి 5కిడ్నీలు-అయినా ఆరోగ్య స‌మ‌స్య‌లు..!

ఒక మ‌నిషికి ఎన్ని కిడ్నీలు ఉంటాయి..రెండు..లేదంటే ఒకొక్క‌రికి ఒకే ఉంటుంది. కానీ ఈ వ్య‌క్తికి ఏకంగా 5కిడ్నీలు ఉన్నాయట‌. ఆ వివ‌రాలు చూద్దాం.దాదాపు 37 ఏళ్ల క్రితం అంటే 1994లో.. ఒక వ్యక్తికి రెండు కిడ్నీలు చెడిపోయాయి. అప్పటికి అతడి వయసు కేవలం పద్నాలుగేళ్లు మాత్రమే. దీంతో కిడ్నీట్రాన్స్ ప్లాంట్ ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. అలా అమర్చిన కిడ్నీ తొమ్మిదేళ్ల పాటు సక్రమంగా పని చేసింది. అయితే.. తర్వాత అది కూడా చెడిపోవటంతో 2005లో ఒకసారి మరో కిడ్నీని పెట్టించుకోవాల్సి వచ్చింది. అది కూడా పన్నెండేళ్ల పాటు బాగా పని చేసింది. అంతా బాగుందనుకున్న వేళ.. ఆ కిడ్నీ కూడా చెడిపోయింది. ఇప్పుడా పేషెంట్ వయసు 41 ఏళ్లు. అతడి నాలుగో కిడ్నీ కూడా చెడిపోవటంతో మరో కిడ్నీని అతడికి అమర్చాల్సి వచ్చింది. అదే ఇప్పుడు కొత్త సమస్యకు కారణమైంది. నాలుగో కిడ్నీ పెట్టిన ఏడెనిమిదేళ్ల వరకు బాగానే పని చేసినా.. గడిచిన నాలుగేళ్లుగా అతడికి కిడ్నీ సమస్యలు మొదలయ్యాయి. దీంతో పూర్తిగా డయాలసిస్ కే పరిమితం కావాల్సి వచ్చింది. వారానికి మూడుసార్లు డయాలిసిస్ చేయించుకోవాల్సి వచ్చింది. రక్త నియంత్రణ లేకపోవటం.. ఈ ఏడాదిలో ట్రిపుల్ బైపాస్ సర్జరీ చేయించుకోవటంతో అతడి ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. దీంతో మరోసారి కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయాల్సిన పరిస్థితి. ఇక్కడ చెప్పాల్సిన మరో విషయం ఏమంటే.. కిడ్నీని అమర్చే సమయంలో పాత కిడ్నీల్నితీసేయటం సాధ్యం కాదు. అందుకే..కిడ్నీలకు దగ్గరగా వాటిని అమరుస్తారు. ఒకట్రెండు కిడ్నీల్ని అమర్చటం కష్టం కాదు కానీ.. వరుసగా మూడో కిడ్నీని ఏర్పాటు చేయటం కష్టంగా మారింది. జాగా లేకపోవటంతో.. అతి కష్టంగా కిడ్నీని అమర్చారు. కొత్తగా ఏర్పాటు చేసిన ఐదో కిడ్నీకి రక్త ప్రసరణ ఏర్పాటు చేసేందుకు వైద్యులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఐదో కిడ్నీని రోగి పేగులకు సమీపంలో అమర్చారు. అమోర్టా రక్తనాళం రెండుగా విడిపోయే చోట కొత్త కిడ్నీలోని సిరను జోడించారు. రీనల్ వెయిన్ ను ఇన్ ఫీరియర్ వెనకావాతో జోడించారు. ఈ అరుదైన శస్త్రచికిత్సకు చెన్నైలోని మద్రాస్ మెడికల్ మిషన్ ఆసుపత్రి వేదికగా మారింది. ఈ క్లిష్టమైన సర్జరీ పూర్తి అయ్యాక.. పేషెంట్ ను జాగ్రత్తగా గమనిస్తున్నారు. మరికొద్ది రోజులు వైద్యులపర్యవేక్షణలో ఉండాల్సి ఉంటుందని చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *