ఇండియాలో పోలీసులు వాడే బైక్స్ ఇవే..

భార‌త‌దేశంలో పోలీసులు ఎక్కువ‌గా వాడే వెహిక‌ల్స్ ఏంటో తెలుసా..టూ వీలర్స్. కొన్ని చోట్ల మాత్రమే ఫోర్ వీలర్స్ లో కనిపిస్తే.. మిగిలిన చోట్ల పెట్రోలింగ్ కోసం ఇరుకు గల్లీల్లో తిరగడానికి, ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న సమయంలోనూ వెళ్లిపోవడానికి వాటినే ఎంచుకుంటారు. ఈ క్రమంలోనే ఇండియాలో హోండా సీబీఆర్ నుంచి హ్యార్లీ డేవిడ్‌సన్ వరకూ వాడే బైకుల వివరాలిలా ఉన్నాయి.పంజాబ్, ఢిల్లీ..ఇండియాలోని కామన్ పీపుల్ ఎక్కువగా వాడే బైకుల్లో పల్సర్ ఒకటి. ఎందుకంటే వారికి కేటాయించే బడ్జెట్స్ లో పవర్ ఫుల్ గా కనిపించేది బజాజ్ పల్సర్ బైకులే. రెగ్యూలర్ పల్సర్ తో పోలిస్తే పల్సర్ 180 మంచి పర్‌ఫార్మెన్స్ వస్తుంది. ఢిల్లీ, కేరళ, నోయిడా, తమిళనాడు పల్సర్‌తో పోటీపడాలంటే అపాచీ మాత్రమే సరిపోతుంది. దీనిని నోయిడా, తమిళనాడు, కేరళ, ఢిల్లీ పోలీసులు కూడా వాడుతుంటారు. అపాచీ 160, 180రెండూ వాడుతున్నారు. పబ్లిక్ అనౌన్స్‌మెంట్ల కోసం సైరన్ ఏర్పాటు చేసుకుని యుటిలిటీ బాక్సులతో కనిపిస్తుంటాయి. ముంబైలోని మహిళా పోలీసులు.. హీరో అచీవర్ ను తెగవాడేస్తున్నారు. రాయల్ ఎన్ ఫీల్డ్ తో పోలిస్తే తక్కువ బరువు ఉండటమే దీనికి కారణం. డైలీ సిటీలో తిరిగేందుకు అనుకూలంగా ఉంటుంది. రాజస్థాన్, ఢిల్లీ, ముంబై, యూపీ, కోల్‌కతా..ఇండియన్ ఆర్మీతో పాటు మరికొన్ని పోలీస్ పోర్సులకు అఫీషియల్ టూ వీలర్ సప్లయర్ గా మారింది రాయల్ ఎన్‌ఫీల్డ్. అనుకూలమైన, బెటర్ పర్ ఫార్మెన్స్ ఇవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది.గోవాలోని ఇరుకువీధుల్లో సైతం తిరిగేందుకు వీలుగా అక్కడి వారికి స్ప్లెండర్ బైక్ లు అలాట్ చేశారు. మైలేజ్ పరంగానూ ఇవి చాలా బెస్ట్.జైపూర్ లో పాట్రోలింగ్ కోసం హీరో డ్యూయెట్స్ బైకులు ఇచ్చారు. బ్లాక్ కలర్ లో.. పోలీస్ స్టిక్కరింగ్ తో కనిపిస్తుంటాయి. ఇందులో కూడా పబ్లిక్ అనౌన్స్ మెంట్ సిస్టమ్ ఇన్ బిల్ట్ అయి ఉంది.ఢిల్లీలో కొందరు పోలీసులకు Royal Enfield Interceptor 650 ఇచ్చారు. బ్యాక్ రెస్ట్, తో పాటు ఢిల్లీ పోలీస్ స్టిక్కర్లు అంటించి, పబ్లిక్ అనౌన్స్‌మెంట్ తో రెడీ అవడమే కాకుండా బ్లాక్ కలర్ లో అందుబాటులో కనిపిస్తున్నాయి. ఢిల్లీ, గురుగ్రామ్ లలో ఉండే మహిళా పోలీసులకు సులువుగా ఉండేందుకు హోండా యాక్టివా ఇచ్చారు. ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ స్కూటర్ ను పాట్రోలింగ్ కోసం వాడుతున్నారు. మైలేజ్ పరంగానూ ఇదే బెస్ట్ అండ్ రిలైబుల్. 2013లోనే తొలిసారి పోలీస్ ఎడిషన్ గా మార్కెట్ లోకి వచ్చింది సీబీఆర్ 250ఆర్. యూపీ పోలీసులు దీని ర్యాంకును బట్టే పోలీస్ సెక్టార్ కు అప్పగించారట. కాకపోతే తయారీకి పోలీసుల వాడకానికి కాస్తంత తేడా కనిపిస్తుంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *