ఇండియా వ్యాక్సిన్‌ ఓ సంజీవని: బ్రెజిల్‌ ప్రధాని ట్వీట్

కరోనాతో ఇబ్బందుల్లో ఉన్న తమకు ఇండియా వ్యాక్సిన్‌ సరఫరా చేయడంపై చేరుకోవడంపై బ్రెజిల్‌ అధ్యక్షుడు జైరో బోల్సోనారో హర్షం వ్యక్తం చేశారు. భారత్ లో తయారైన రెండు మిలియన్‌ డోసుల కరోనా వ్యాక్సిన్లు బ్రెజిల్‌కు శనివారం చేరాయి. ఈ సందర్భంగా ట్విట్టర్‌ వేదికగా ప్రధాని మోడీకి థ్యాంక్స్‌ చెప్పిన ఆయన హనుమంతుడు సంజీవని తెచ్చినట్లు.. భారత వ్యాక్సిన్‌ తెచ్చిందని పేర్కొన్నారు. ఈ మేరకు ఓ చిత్రాన్ని పోస్ట్‌ చేసిన బొల్సెనారో.. “వ్యాక్సిన్‌ ఎగుమతి చేసినందుకు భారత్‌కు ధన్యవాదాలు. ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ఇండియాతో భాగస్వామ్యం కావడం గర్వంగా, గౌరవంగా ఉంది” అని ట్వీట్ చేశారు. దీనికి ప్రధాని మోడీ సమాధానమిస్తూ.. ఆరోగ్య సంరక్షణపై తమ సహకారాన్ని బలోపేతం చేస్తూనే ఉంటామని హామీ ఇచ్చారు. ఆస్ట్రాజెనికా- ఆక్స్‌ ఫర్డ్‌ నేతృత్వంలో సీరం అభివృద్ధి చేసిన రెండు మిలియన్‌ డోసుల కొవిషీల్డ్‌ వ్యాక్సిన్లను బ్రెజిల్‌కు శుక్రవారం ఇండియా ఎగుమతి చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *