ఈ క్యాప్ పెట్టుకుంటే దిష్టే తగలదట..ధర ఎంతో తెలుసా..
నరగోలకి నల్ల రాయి బద్దలవుతుందన్న సామెత తెలుసుగా..దిష్టి బొమ్మ లేని ఇళ్లు ఉండవు. ఇంటి గుమ్మాలు మొదలుకుని హోటళ్లు, దుకాణాలు, వాహనాలపైనా ఈ బొమ్మలు దర్శనమిస్తూనే ఉంటాయి. నరదిష్టిపై ప్రజల్లో ఉండే నమ్మకాన్ని పసిగట్టిన ‘వెజ్ అండ్ నాన్‌వెజ్’ అనే సంస్థ ఓ కొత్త వ్యాపార వ్యూహాన్ని అమలు చేసింది. నజర్ బట్టును క్యాప్‌లపై ముద్రించి మార్కెట్ చేసుకుంటున్నది. అంతేకాదు, ‘ఈ క్యాప్ పెట్టుకుంటే మీకు దిష్టే తగలదు. పైగా మీశక్తి రెట్టింపు అవుతుంది’ అనే నినాదాన్నీ రూపొందించింది. కరోనా మహమ్మారి ప్రబలడంతో వ్యాపారం పడిపోయింది. దాంతో ఇలా కొత్తగా ప్రయత్నించి లాభాలు ఆర్జిస్తున్నది ‘వెజ్ అండ్ నాన్‌వెజ్’. కొత్తదనాన్ని ఇట్టే పట్టేసే మన కుర్రాళ్లు.. నజర్బట్టు క్యాప్లతో వీధుల్లో హల్చల్ చేస్తున్నారు. ఇంతకీ ఈ టోపీ ధర ఎంతో తెలుసా రూపాయి తక్కువ 500. ఈ సరికొత్త కాటన్ క్యాప్‌ను సొంతం చేసుకునేందుకు వేలాదిమంది వెబ్సైట్లో ఆర్డర్లు పెడుతున్నారట.ఏంటో విడ్డూరం..