ఈ లక్షణాలు ఉంటే బాదం తినకూడదు..
ఈ ఐదు లక్షణాలు కలిగిన వ్యక్తులు బాదం పప్పులను అస్సలు తినకూడదని చెబుతున్నారు వైద్యులు. అలా తింటే.. పెను ప్రమాదం పొంచిఉన్నట్లే అని హెచ్చరిస్తున్నారు. మరి బాదం పప్పును ఎవరు తినకూడదో తెలుసుకుందాం.. మీకు బీపీ ఉందా? అందుకు సంబంధించిన ట్యాబ్లెట్స్ వాడుతున్నారా? అయితే, మీరు బాదం పప్పులు తినకూడదు. కారణం.. బాదంలో మాంగనీస్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో రక్తపోటును పెంచుతుంది.2. మైగ్రేన్ సమస్యలు ఉన్నవారు కూడా బాదం తినడం మానుకోవాలి. బాదంలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. విటమిన్ E అధికంగా ఉండటం వల్ల తలనొప్పి, అలసట, మైకం వస్తుంది. అందువల్ల, మైగ్రేన్ రోగులు బాదం పప్పులను చాలా పరిమిత పరిమాణంలో తీసుకోవాలి. వీలైతే వాటిని తినడం మానేయటం ఉత్తమం.3. కిడ్నీ స్టోన్ సమస్యలు ఉన్నవారు బాదం తినడం మానుకోవాలి. వాస్తవానికి, మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో బాధపడుతున్న వ్యక్తులు బాదం పప్పులను తినొద్దని వైద్యులు స్పష్టంగా చెబుతారు. ఈ బాదం పప్పులో ఆక్సలేట్ ఉంటాయి. ఇది కిడ్నీ స్టోన్స్ సమస్యను మరింత పెంచుతుంది.
4. జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉన్న వ్యక్తులు బాదం తినడం కూడా మానుకోవాలి. బాదంలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అలాగే శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. ఈ కారణంగా గ్యాస్, ఆమ్లత్వం, మలబద్ధకం, కడుపులో మంట మొదలైనవి ఏర్పడే అవకాశం ఉంది.
5. అధిక బరువుతో బాధపడుతున్నారా? అయితే మీరు కూడా బాదం పప్పులను అస్సలు తినొద్దు. బాదంలో అధిక కేలరీలు, కొవ్వులు ఉంటాయి. ఇవి మీ ఊబకాయాన్ని మరింత పెంచుతాయి. అందుకే.. ఊబకాయులు బాదం పప్పులను తినడం మానేయాలి.