ఉచితంగా బాబా రాందేవ్ కరోనిల్ కిట్..ఎక్కడో తెలుసా..

కరోనాని నియంత్రించే పనిలో పలువురు ఆయుర్వేదం..నాటు మందులను కనిపెట్టారు. కాగా ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ కు చెందిన పతంజలి సంస్థ కరోనా కోసం ‘కరోనిల్’ అనే ఔషధాన్ని తయారు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ మందు విశ్వసనీయతపై పలు అనుమానాలున్నాయి. దీనిపై వివాదం కూడా కొనసాగుతోంది. మరోవైపు, కరోనిల్ ను కోవిడ్ పేషెంట్లకు పంపిణీ చేయాలని హర్యానా ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా బారిన పడిన వారికి ఉచితంగా ఈ కరోనిల్ కిట్ ను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని హర్యానా మంత్రి అనిల్ విజ్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.హర్యానాలోని కోవిడ్ పేషెంట్లకు ఒక లక్ష పతంజలి కరోనిల్ కిట్లను పంపిణీ చేస్తామని అనిల్ విజ్ వెల్లడించారు. ఈ కిట్లకు అయ్యే ఖర్చును పతంజలి సగం భరిస్తుందని… మిగిలిన సగం ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు.మరోవైపు, కరోనిల్ పై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఈ ఔషధాన్ని అశాస్త్రీయంగా కొట్టిపారేసిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో తమ మెడిసిన్ కు ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్టిఫికెట్ కూడా ఉందని రాందేవ్ వాదించారు. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో పతంజలి మెడిసిన్ కు హర్యానా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *