ఎవరు మీలోకోటీశ్వరుడులో.. కోటి గెలుచుకున్న తెలంగాణ యువకుడు..
బుల్లితెరపై ప్రస్తుతం రెండు రియాల్టీ షోలు సందడి చేస్తున్నాయి..వాటిల్లో ఒకటి బిగ్ బాస్5,మరొకటి ఎవరు మీలో కోటీశ్వరులు. ఎవరు మీలో కోటీశ్వరుడికి స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోకి ఎనలేని ఆదరణ లభిస్తోంది..సినీ సెలబ్రిటీలు ఈ షోలో సందడి చేస్తున్నారు. కాగా ఎవరు మీలో కోటీశ్వరులు షోలో తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడేనికి చెందిన యువకుడు కోటి రూపాయలు గెలుచుకున్నట్టు సమాచాం. జిల్లాలోని సుజాతనగర్ మండలానికి చెందిన బి.రాజారవీంద్రను ఈ అదృష్టం వరించినట్టు రిలీజ్ చేసిన ప్రోమో ద్వారా తెలుస్తోంది. డీజీపీ క్యాంపు కార్యాలయంలో ఎస్సైగా పనిచేస్తున్న రాజారవీంద్ర ఈ షోలోని మొత్తం 15 ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇచ్చి కోటి రూపాయలు గెలుచుకున్నట్టు సమాచారం. హోస్ట్ ఎన్టీఆర్ కోటి రూపాయల ప్రశ్న సంధించగా రాజారవీంద్ర సమాధానం చెప్పి దానిని ఫిక్స్ చేయమనడం ప్రోమోలో కనిపిస్తోంది. ఇప్పుడీ ప్రోమో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ఈ షో రేపు ప్రసారం కావాల్సి ఉండగా, రవీంద్ర కోటి రూపాయలు గెలుచుకున్న విషయంపై షో నిర్వాహకులు ఇంకా పెదవి విప్పలేదు. ప్రొమో మాత్రం ఆయన కోటి రూపాయలు గెలుచుకున్నారనే విధంగా ఉంది. చూడాలి ఏమవుతుందో.