ఏపీ హైకోర్టు తరలింపు అప్పుడే.. కేంద్రం
ఆంధ్రప్రదేశ్ హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు తరలిస్తున్నారని వస్తున్న వార్తలపై గురువారం రాజ్యసభలో కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. ఏపీ హైకోర్టు తరలింపుపై బీజేపీ ఎంపీ జీవీఎల్ ప్రశ్నించగా, దానికి కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. గతేడాది ఫిబ్రవరిలో హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు తరలించాలని ఏపీ సీఎం జగన్ ప్రతిపాదన తీసుకొచ్చారని, ఏపి హైకోర్టుతో ప్రభుత్వం సంప్రదింపులు, ఏకాభిప్రాయం తరువాతే తరలింపు నిర్ణయం ఉంటుందని మంత్రి తెలిపారు. హైకోర్టు నిర్వహణ బాధ్యతంతా రాష్ట్ర ప్రభుత్వానిదే అని, పరిపాలన మాత్రం ప్రధాన న్యాయమూర్తి పరిధిలో ఉంటుందని అన్నారు. హైకోర్టు, ఏపీ ప్రభుత్వం సంప్రదింపుల తరువాతే 3 రాజధానులపై నిర్ణయం ఉంటుందని సమాధానం ఇచ్చారు.